ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది ప్రజలు చెడు జీవనశైలి, ఆహారం కారణంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు.
ప్రజలు పెద్ద మొత్తంలో జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తింటారు.బయటి ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో వివిధ రకాల విటమిన్లు, పోషకాల కొరత ఏర్పడుతుంది.
ఒక వ్యక్తి శరీరంలో B12 విటమిన్ తగ్గితే అనేక రకాల వ్యాధులు వస్తాయి. అయితే B12 లోపం వల్ల తెల్లమచ్చలతో పాటు సంతానలేమి సమస్యలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు.
విటమిన్ బి12 లోపం ఏర్పడితే స్త్రీ, పురుషులిద్దరిలో వంధ్యత్వం రావచ్చని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. మన నాడీ వ్యవస్థకు శరీరంలో విటమిన్ బి12 అవసరం. దీని లోపం వల్ల రక్తహీనత వస్తుంది.
విటమిన్ బి 12 లోపం ఉంటే ఆహారంలో గుడ్లు, పాలు, అరటిపండ్లు, బాదం, టమోటాలు, టోఫు, మొలకలు, పుట్టగొడుగులు, చేపలను చేర్చుకోవచ్చు.
శాఖాహారులైతే డాక్టర్ సలహా మేరకు పాలు, అరటిపండు, బాదం, పుట్టగొడుగులు, కొన్ని మందులు తీసుకోవచ్చు.