/rtv/media/media_files/2024/11/28/eyebrows6.jpeg)
కనుబొమ్మలు పల్చగా ఉంటే లుక్ బాగా కనిపించదు. సన్నటి కనుబొమ్మలను బొద్దుగా మార్చుకోవడానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ఇంటి చిట్కాలతో సులభంగా లుక్ మార్చుకోవచ్చు.
/rtv/media/media_files/2024/11/28/eyebrows1.jpeg)
కనుబొమ్మల పెరుగుదలకు అలోవెరా జెల్‌ని ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్‌ను వేలితో తీసుకుని కనుబొమ్మలపై మసాజ్ చేయాలి. అరగంట తర్వాత కడుక్కోవాలి. అలోవెరా జెల్‌ను రాత్రి అప్లై చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2024/11/28/eyebrows4.jpeg)
జుట్టు పెరుగుదలను పెంచడానికి మెంతులు ప్రభావవంతంగా ఉంటాయి. ఒక టీస్పూన్ మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత పేస్ట్‌లా చేసి కనుబొమ్మలపై అప్లై చేయాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.
/rtv/media/media_files/2024/11/28/eyebrows2.jpeg)
ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్డు పచ్చసొన కనుబొమ్మల పెరుగుదలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పచ్చసొనను కనుబొమ్మలపై అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ముఖం కడగాలి.
/rtv/media/media_files/2024/11/28/eyebrows3.jpeg)
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 4 నుండి 5 చుక్కల ఆముదం కలపండి. రాత్రి పడుకునే ముందు తాగాలి. పాల ఎలర్జీ ఉంటే వేడి నీటిలో 2 టీస్పూన్ల ఆవనూనెను కలిపి తీసుకోవచ్చు.
/rtv/media/media_files/2024/11/28/eyebrows5.jpeg)
తాజా నిమ్మరసం కనుబొమ్మలు పెరిగేందుకు సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.