AC: చాలా మంది ఇంట్లో వేడిగా ఉందని ఏసీని బాగా ఎక్కువ పెడుతుంటారు. ఏసీ ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంచితే ఆరోగ్యం దెబ్బతింటుంది. బాగా ఉష్ణోగ్రత నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కువ చాలామంది ఏసీ వేసుకొని టెంపరేచర్ బాగా తక్కువ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. కొందరు ఏసీ ఉష్ణోగ్రతను 18 లేదా 16 కు సెట్ చేస్తారు. దీని వల్ల గదంతా మంచులా మారుతుంది. ఈ చల్లదనం బాగానే ఉన్నా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఏసీ ఉష్ణోగ్రత 20 లోపు ఉంచితే గదిలో ఉన్నవారు అనారోగ్యానికి గురవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏసీ ఉష్ణోగ్రత 20 కంటే తక్కువగా ఉంటే ఎలాంటి హాని జరుగుతుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
అలర్జీల ప్రమాదం:
ఓ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం ఏసీ ఉష్ణోగ్రత 20 కంటే తక్కువ ఉంటే గదిలో 6 గంటల పాటు మనం ఉన్నట్లయితే చర్మంలో తేమ తగ్గుతుందని చెబుతున్నారు. వాస్తవానికి ఏసీ తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచితే చర్మం నుంచి తేమను ఇది గ్రహిస్తుంది. చర్మం నుంచి నూనె రావడం ప్రారంభమవుతుంది. దీని వల్ల ముఖంపై ముడతలు, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి: వైద్యులు తెల్లకోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా?
గదిలోని ఏసీ 20 కంటే తక్కువగా ఉంటే చర్మం పొడిబారే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల నాసికారంధ్రాలు కూడా మూసుకుపోతాయి. ఇది ముక్కులో అలర్జీల ప్రమాదాన్ని పెంచుతుంది. గదిలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో తేమ తగ్గడమే కాకుండా కళ్ళలో కూడా తేమ తగ్గుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారి పోతాయి. కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే