Fitness: నెల రోజులు ఇలా చేశారంటే ఫిట్నెస్ మీ సొంతం ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొలెస్ట్రాల్ ఆహారాల వినియోగం, బిస్కెట్లు, పాన్కేక్లు, శీతల పానీయాలకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. పండ్లు, కూరగాయలు, హోల్ వీట్ బ్రెడ్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే ఫిట్నెస్ బాగుంటుంది. By Vijaya Nimma 19 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం తప్పనిసరిగా మారింది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి. ఇది మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మన శరీరం తక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. దీని వల్ల శరీర బరువు పెరుగుతుంది. జీవక్రియ రేటు తగ్గుతుంది, మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి. 2/6 శారీరక శ్రమ లేకపోతే ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పొత్తికడుపులో కొవ్వు పేరుకుపోతుంది. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. 3/6 ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొలెస్ట్రాల్ ఆహారాల వినియోగాన్ని తగ్గించండి. బిస్కెట్లు, పాన్కేక్లు, శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. బదులుగా పండ్లు, కూరగాయలు, హోల్ వీట్ బ్రెడ్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. 4/6 చికెన్, చేపలు, గుడ్లు, పప్పులు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. యాపిల్స్, బఠానీలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 5/6 పెరుగు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు కేలరీలను బర్న్ చేస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. 6/6 యోగా శరీర ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మనసుకు విశ్రాంతినిస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం హార్మోన్ల అసమతుల్యత, బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి 7-8 గంటల పాటు నిద్రపోవడం అవసరం. #fitness మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి