మనం తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే చాలు...టెన్షన్‌కి చెక్‌ ..

New Update

మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరికీ నిత్యం రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. పని చేసే ఆఫీసులో పై అధికారులు ఇచ్చే టార్గెట్ల కోసం రాత్రి, పగలనక అదే పనిగా కంప్యూటర్ పరికరాల ముందు కూర్చొవడం, ఇక అవి పూర్తి చేయకపోతే వారి నుంచి వచ్చే హెచ్చరికలు, సహోద్యోగులతో కలిసి ఉమ్మడిగా పని చేయాల్సి వచ్చినప్పుడు మనస్పర్థలతో కొంత మానసిక ఒత్తిడికి గురవ్వడం సహజమే. ఇవే కాకుండా కుటుంబ సమస్యలు ఉంటాయి. కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా ఒత్తిడిని ప్రేరేపిస్తాయి. అయితే కొంతమంది చిన్న,చిన్న సమస్యలకు కూడా బాగా టెన్షన్ పడిపోతుంటారు. ఆ సమయంలో అరచేతులు చెమటలు పట్టడం, శరీరం వణకడం, మాట్లాడేటప్పుడు గొంతు ధ్వనిలో మార్పు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

lifestyle-are-you-getting-stressed-due-to-small-problemsఅయితే ఇలా ప్రతిదానికి టెన్షన్ పడడం వలన ఆరోగ్యంపై ప్రభావం చూపి ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఈ ఒత్తిడిని అదుపు చేసేందుకు మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు ఉండేలా చూసుకుంటే టెన్షన్ ఇట్టే దూరమైపోతుంది. కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే వీటన్నింటికి పుల్ స్టాప్ పెట్టొచ్చు అంటున్నారు. వైద్యులు... డార్క్ చాక్లెట్లకు ఒత్తిడిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లో ప్రొటిన్లు, విటమిన్లు, మెగ్నీషియంతో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి పోషక విలువలు మెండుగా ఉండే బ్రెజిలియన్ నట్స్, వాల్ నట్స్, బాదం వంటి వాటిని ఆహారంలో తీసుకుంటే మంచిది. సాల్మాన్ చేపల కూర తినడం వలన కూడా మన ఒత్తిడి దూరం అవుతుంది. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.

వీటి వల్ల మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఒత్తిడి క్షణాల్లో దూరం అవుతుంది. అలాగే కొన్నిరకాల ప్లవర్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో శంఖాకార పువ్వులో ఎన్నో ఔషద గుణాలు దాగుంటాయిని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో చామంతి పువ్వు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటితో టీ చేసుకుని తాగితే ఒత్తిడిని క్షణాల్లో దూరం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు