Mango Peel Uses: పండ్లలో రారాజు మామిడిని పండు.ఇది రుచితో పాటు అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి. సాధారణంగా మామిడికాయ తినాలంటే దాని తొక్క తీసి గుజ్జును తింటాము. ఆ తర్వాత తొక్కను చెత్తబుట్టలో వేస్తారు. అయితే దీని తొక్కలతో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
మామిడి తొక్కలను తొక్కలను ఎలా ఉపయోగించాలి
కంపోస్ట్
మామిడి పండు తిన్నప్పుడల్లా, దాని తొక్కలను కడిగి ఒక గిన్నెలో నిల్వ చేయండి. ఇప్పుడు ఈ తొక్కలను మట్టి కుండలో వేసి, వాడిన టీ పౌడర్ కూడా వేయండి. ఆ తర్వాత మట్టితో నింపండి. కొద్ది రోజుల్లో అది ఎరువుగా మారుతుంది.
మ్యాంగో టీ
మ్యాంగో టీ పేరు వినే ఉంటారు. దీన్ని చేయడానికి మామిడి తొక్కలను ఉపయోగించవచ్చు. తొక్కలను నీటిలో ఉడకబెట్టి, ఆ తర్వాత కాస్త టీ పౌడర్ వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసి తాగాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చర్మ సంరక్షణ
ముఖంపై ముడతలను మామిడి తొక్కల సహాయంతో తొలగించవచ్చు. మామిడి తొక్కలను కడిగి బాగా ఎండబెట్టి మెత్తగా చేసి నిల్వ చేసుకోవాలి. అందులో నీరు లేదా పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖం పై టానింగ్, ముడతలను తొలగిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
మామిడి తొక్కలు జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. దీని కోసం మామిడి తొక్కతో చేసిన టీ లేదా వాటిని పొడిని తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Eggs: గుడ్లు తినేవాళ్లు జాగ్రత్త..! లేదంటే ఈ తిప్పలు తప్పవు ..?