Washing Machine Hacks : ఈ రోజుల్లో దాదాపు ప్రతీ ఇంట్లో వాషింగ్ మెషిన్ (Washing Machine) కనిపిస్తుంది. ముఖ్యంగా నగరాల్లో దీని వినియోగం మరీ ఎక్కువగా ఉంటుంది. వాషింగ్ మెషీన్‌తో బట్టలు ఉతకడం చాలా సులభం. అయితే వాషింగ్ మెషిన్ ఉపయోగించేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు యంత్రాన్ని త్వరగా దెబ్బతీస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పొరపాట్లు సరి చేసుకుంటే యంత్రం ఏళ్ల తరబడి ఆగకుండా నడుస్తూనే ఉంటుంది.
ఓవర్ లోడ్ చేయడం
వాషింగ్ మెషీన్‌ను ఓవర్‌లోడ్ (Over Load) చేయడం వల్ల.. మోటారు, డ్రమ్, బేరింగ్‌లపై ఒత్తిడి పడుతుంది. ఇది యాంత్రిక వైఫల్యానికి దారితీస్తుంది.
డిటర్జెంట్ ఎక్కువ ఉపయోగించడం
ఎక్కువ డిటర్జెంట్‌ని ఉపయోగించకూడదు. ఇది వాషింగ్ మెషీన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. మెషిన్ డ్రమ్, పైప్ లో సోప్ పేరుకుపోవడానికి కారణమవుతుంది.
డ్రమ్ క్లీన్ చేయడం
లిన్ట్ ఫిల్టర్, డిటర్జెంట్ డిస్పెన్సర్, డ్రమ్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. లేదంటే ఆపరేషన్‌లో సమస్యలను కలిగిస్తుంది. అలాగే, నీటి పైపును ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల లీకేజ్ లేదా పగిలిపోవడం వంటి వాటికి దారితీస్తుంది.
బరువైన వాటిని మెషిన్ లో వేయకండి
కార్పెట్ లేదా పెద్ద దుప్పటి వంటి భారీ వస్తువులను వాషింగ్ మెషిన్ లో వేయడం వల్ల మెషిన్ పాడవుతుంది. మోతాదుకు మించిన బరువు వేయకూడదని గుర్తుంచుకోండి.
వింత శబ్దాలను నెగ్లెక్ట్ చేయవద్దు
మెషిన్ నుంచి అసాధారణ శబ్దాలు వినిపించినప్పుడు అశ్రద్ధ చేయవద్దు. వాటిని పట్టించుకోకుండా మెషిన్ ను అలాగే వాడడం వల్ల తీవ్రమైన యాంత్రిక సమస్యలు ఏర్పడవచ్చు.
తడి బట్టలు
మెషిన్‌లో తడి బట్టలను ఎక్కువ సేపు ఉంచవద్దు. తడి దుస్తులను ఎక్కువసేపు మెషిన్ లో ఉంచడం వల్ల వాటిపై బూజు పెరుగుతుంది. ఇది మెషిన్, బట్టలు రెండింటినీ ప్రభావితం చేస్తుంది.
పంప్ ఫిల్టర్ శుభ్రం చేయడం
పంప్ ఫిల్టర్ లో చెత్త పేరుకుపోతుంది. అటువంటి పరిస్థితిలో, క్లాగ్స్, డ్రైనేజీ సంబంధిత సమస్యలను నివారించడానికి క్రమం తప్పకుండా పంప్ ఫిల్టర్ ను శుభ్రం చేయాలి.
కంపెనీ గైడ్ లైన్స్
వాషింగ్ మెషిన్ ఎక్కువ రోజుల పనిచేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దాని పై రాసిన కంపెనీ గైడ్ లైన్స్ (Company Guidelines) తప్పకుండా పాటించాలి. కంపెనీ మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల మెషీన్‌లో అకాల సమస్యలు తలెత్తుతాయి.
Also Read: This Week Movies: ఈ వారం థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు..! వివరాలివే - Rtvlive.com