Stray Dog Attack: వీధి కుక్కలు దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి..? ఈ మధ్య వీధి కుక్కల దాడులు బాగా పెరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు కుక్కల దాడి నుంచి మిమల్ని మీరు రక్షించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. పరుగెత్తడానికి బదులుగా చేతిలో ఉన్న ఏదైనా వస్తువుతో వాటిని భయపెట్టడానికి ప్రయత్నించండి. ఏదైనా ఫుడ్ ఉంటే వాటి ముందు వేసి డైవర్ట్ చేయండి. By Archana 24 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Stray Dog Attack: ఈరోజుల్లో వీధికుక్కలు దాడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట వీధికుక్కలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో చిన్న పిల్లలు, వృద్ధులు, యువకులు కూడా ఉన్నారు. ఒక్కసారి కుక్కల వెంటపడితే వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు కూడా ఉండవచ్చు. కుక్క కాటు వల్ల రేబిస్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అయితే అటువంటి పరిస్థితిలో, వీధి కుక్కల దాడి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. ప్రశాంతంగా ఉండండి కుక్కలు మిమ్మల్ని వెంబడించినప్పుడు ప్రశాంతంగా ఉండండి. కుక్కలు గట్టిగా మొరిగినప్పుడు లేదా కుక్కలు మీ దగ్గరకు వచ్చినప్పుడు భయాందోళనలకు బదులు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. వేగంగా పరిగెత్తడం లేదా పారిపోవడం కంటే ప్రశాంతంగా నిలబడడానికి ప్రయత్నించండి. కుక్కలు మీ వెనుక వచ్చినప్పుడు భయపడి వేగంగా పరుగెత్తడం ద్వారా కుక్కలు మరింత దూకుడుగా మారతాయి. అందుకని ఆ సమయంలో ప్రశాంతంగా వ్యవహరించాలి. తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. పరుగెత్తడానికి బదులుగా.. చేతిలో ఉన్న కర్ర, గొడుగు లేదా మరేదైనా వస్తువుతో కుక్కలను భయపెట్టడానికి ప్రయత్నించండి. ఇది కాకుండా, మీ వద్ద ఏదైనా ఆహార పదార్ధం ఉంటే, వాటిని ముందు విసిరి కుక్కల దృష్టి మరల్చడానికి ప్రయత్నించండి. ఆపై నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోండి. అస్సలు భయపడకండి కుక్కను చూసి ఆశ్చర్యపోవడం, కలత చెందడం, భయపడేవారూ తరచూ వీధికుక్కల దాడికి గురవుతున్నట్లు కనిపిస్తుంది. కుక్కలను చూడగానే భయపడడం మానేసి ప్రశాంతంగా ముందుకు నడవండి. మీరు టెన్షన్ పడడం, పరుగెత్తడం చేయడం ద్వారా కుక్కలు బెదిరింపులకు గురవుతున్నట్లు భావించి దాడి చేయడానికి ముందుకు వస్తాయి. వెళ్ళే దారిలో ఏదైనా వీధి కుక్కలు కనిపిస్తే వాటితో జోక్యం చేసుకోకుండా.. మీ మార్గంలో నేరుగా వెళ్లండి. కుక్కలతో మాట్లాడండి ఇది కొంచెం జోక్ గా అనిపించవచ్చు. కానీ ఇది చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్ట్రే డాగ్స్ తరచుగా అపరిచితులపై దాడి చేస్తాయి. చాలా సార్లు, రాత్రిపూట విజిబిలిటీ బాగా లేనప్పుడు, వీధిలో కుక్కలు మొరుగుతాయి, వెనుక పరిగెత్తడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో కుక్కలతో మాట్లాడటానికి ప్రయత్నించాలి. కుక్కలతో అరుస్తూ కాకుండా ప్రేమగా మాట్లాడడం ద్వారా, కుక్కలు మీ నుంచి ఎటువంటి ముప్పును అనుభవించవు. దాంతో అవి వెనక్కి వెళ్లిపోతాయి. సహాయం తీసుకోండి విషయం తీవ్రమైతే.. ఎవరిదైనా సహాయం తీసుకోండి. కుక్కలు మీ పై దాడి చేసి, అవి ఏ విధంగానూ వెనక్కి తగ్గలేకపోతే, ఎవరైనా సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. చుట్టూ ఎక్కువ మంది వ్యక్తులు ఉండే ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించండి. కుక్కల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సమీపంలోని ఏదైనా ఇల్లు లేదా స్థలాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. మీరు శబ్దం చేయడం ద్వారా మీకు సహాయం చేయడానికి ఇతర వ్యక్తులకు వస్తారు. Also Read: Bigg Boss 8: బిగ్ బాస్8 కంటెస్టెంట్స్ లిస్ట్.. జనసైనికురాలు రేఖా భోజ్ ఎంట్రీ..! - Rtvlive.com #stray-dogs #stray-dog-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి