Soaking Rice : ప్రతి భారతీయ విందులో (Indian Dishes) అన్నం (Rice) లేకుండా భోజనం అసంపూర్ణంగా ఉంటుంది. అన్నం, పప్పులు, కూరగాయలంటే (Vegetables) ఎవరికి ఇష్టం ఉండదు? ఇవి ఆకలిని తీర్చడమే కాకుండా మనసుకు తృప్తిని ఇస్తాయి. అయితే, చాలా మంది సమస్య ఏమిటంటే, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్ర వస్తుందని, అన్నం ఎక్కువగా తింటే షుగర్ పెరుగుతుందని భయపడతారు. అయితే అన్నం వండే ముందు బియ్యాన్ని నానాబెట్టి వండడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చని చెబుతున్నారు నిపుణులు.
అధ్యనాల ప్రకారం, బియ్యం ఉడికించే ముందు నీటిలో నానబెట్టడం చాలా తెలివైన పని. బియ్యాన్ని నీటిలో నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో నిద్రకు కూడా ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. బియ్యాన్ని నీటిలో నానబెట్టడం ద్వారా, దానిలోని పోషకాలు బాగా గ్రహించబడతాయి. బియ్యం నానబెట్టడం ద్వారా బియ్యంలోని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ప్రభావితమవుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను సూచిస్తుంది.
బియ్యం నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఎంజైమాటిక్ విచ్ఛిన్నం జరుగుతుంది. దాని వల్ల బియ్యం గింజల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ విచ్ఛిన్నమై సాధారణ చక్కెరగా మారుతాయి. తద్వారా వాటిలోని గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic Index) కూడా తగ్గిపోతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రలో ఉంచుతుంది.
డయాబెటిక్ రోగులకు ఇది మంచి పద్ధతిగా పరిగణించబడుతుంది. అయితే, 3-4 గంటలు పాటు బియ్యాన్ని నీటిలో ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల విటమిన్లు, మినరల్స్ నీటిలో కరిగి వెళ్లిపోతాయి. దీని వల్ల బియ్యంలోని పోషకాలు నశిస్తాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Bread Rolls: పిల్లలు ఎంతో ఇష్టపడే క్రిస్పీ బ్రెడ్ రోల్స్.. ట్రై చేయండి – Rtvlive.com