Skin Care : ఫేషియల్ హెయిర్ షేవ్ చేసే ముందు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

ముఖం పై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించడానికి రేజర్‌ను ఉపయోగించేవాళ్ళు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. షేవింగ్ చేయడానికి ముందు అలోవెరా జెల్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చికాకు, బ్యాక్టీరియాను తగ్గించడానికి ప్రతీ 5-7 షేవ్స్ తర్వాత రేజర్ మార్చాలి.

Skin Care : ఫేషియల్ హెయిర్ షేవ్ చేసే ముందు.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
New Update

Facial Hair Shave Tips : సాధారణంగా చాలా మంది మొహం పై అవాంఛిత రోమాలను తొలగించడానికి రేజర్ తో షేవ్ చేయడం లేదా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం చేస్తుంటారు. అయితే ఫిషియల్ హెయిర్ తొలగించడానికి రేజర్‌ని ఉపయోగించేవారు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి.

అలోవెరా జెల్

ఫేషియల్ హెయిర్ షేవ్ (Facial Hair Shave) చేయడానికి ముందు అలోవెరా జెల్ (Aloe Vera Gel), మాయిశ్చరైజర్ (Moisturizer) లేదా ఫేస్ ఆయిల్ (Face Oil) అప్లై చేయాలి. ఇలా చేస్తే షేవ్ తర్వాత స్కిన్ స్మూత్ గా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే హెయిర్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది.

మొహాన్ని శుభ్రం చేయడం

షేవింగ్ కు ముందు, ఆ తర్వాత తప్పనిసరిగా మొహాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే షేవ్ చేసే రేజర్ ను వేడి నీటిలో లేదా శుభ్రం చేసిన తర్వాత డెటాల్ లేదా రబ్బింగ్ ఆల్కహాల్ తో క్లీన్ చేయండి.

కళ్ళ దగ్గర ఉపయోగించవద్దు

కళ్ళు, కనుబొమ్మల క్రింద రేజర్ ఉపయోగించవద్దు. ఇది కళ్లకు ప్రమాదకరం. కళ్ళ ప్రదేశంలో చర్మం సున్నితంగా ఉంటుంది. కట్ అయ్యే ప్రమాదం కూడా ఉండొచ్చు.

Facial Hair Shave

ముక్కు దగ్గర

ముక్కును పై ఎల్లప్పుడూ షేవ్ చేయండి. ఇది బ్లాక్ హెడ్స్ రూపాన్ని తగ్గిస్తుంది. అలాగే ముక్కును మృదువుగా చేస్తుంది.

రేజర్ మార్చండి

చర్మం పై చికాకు, బ్యాక్టీరియాను తగ్గించడానికి ప్రతీ 5-7 షేవ్స్ తర్వాత రేజర్లను మార్చండి. లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఒక దిశలో ఉపయోగించండి

అవాంఛిత జుట్టును ఒక దిశలో షేవ్ చేయండి. షేవ్ తర్వాత చర్మాన్ని మృదువుగా ఉంచడానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

స్క్రబ్బింగ్ ఎప్పుడు చేయాలి?

ముఖం మీద యాక్టివ్ మొటిమలు ఉంటే, షేవింగ్ చేయడం మానుకోండి. అలాగే ఎరుపు, చికాకును నివారించడానికి షేవింగ్ తర్వాత 2-3 రోజుల పాటు ఎక్స్‌ఫోలియేట్ (స్క్రబ్బింగ్) చేయకుండా ఉండండి.

Kalki 2898 AD : ప్రభాస్ 'బుజ్జి' మామూలుగా లేదుగా.. ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు..! - Rtvlive.com

#beauty-tips #beauty-care #facial-hair-shave
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe