Junk Food: ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం. అవి చాలా కొవ్వు, చక్కెర , ఉప్పును కలిగి ఉంటాయి. అదే సమయంలో, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ తెలిసినప్పటికీ, పిల్లలు, పెద్దలు ఈ ఆహారాన్ని చాలా ఇష్టపడతారు. బయట ఆహారాన్ని వారానికి ఒకసారి లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి తింటే పర్వాలేదు, కానీ ప్రతిరోజూ ఈ ఆహారాన్నే తింటే సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా పిల్లల్లో జంక్ ఫుడ్ తిన్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయకపోతే స్థూలకాయం, మలబద్ధకం, నిద్రపట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. జంక్‌ను ఎక్కువగా తినడం మధుమేహం వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, జంక్ ఫుడ్ తినే మీ పిల్లల అలవాటును ఎలా దూరం చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
స్నాక్ టిన్‌లో తినడానికి ఏదైనా ఇవ్వండి
పిల్లల స్నాక్ బాక్స్ లో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంచండి, ఖాళీ గ్యాప్ లో పిల్లలు వీటిని తినడం ద్వారా ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పిల్లలను జంక్ ఫుడ్ తినకుండా ఆపాలనుకుంటే, భోజనం, స్నాక్స్ షెడ్యూల్‌ను సరిగ్గా ప్లాన్ చేయండి. పిల్లలకు చిరుతిండి తినాలనిపించిన సమయంలో కొన్ని పండ్లు లేదా తృణధాన్యాలు ఇవ్వండి.
ఆహారంలో ఆరోగ్యకరమైన వెరైటీని ఇవ్వండి
పిల్లలకు ఆహారంలో రకరకాల వెరైటీలను ఇస్తే పిల్లలు హ్యాపీగా తింటారు. వివిధ పండ్లు, కూరగాయలు, పప్పులు, చిక్కుళ్ళును ఇవ్వడానికి ప్రయత్నించండి. పిల్లల ఆహారంలో వెరైటీనీ జోడించడం ద్వారా వారు ఇంటి ఆహరం పై విసుగు చెందరు.
ఆహారాన్ని కలర్ ఫుల్ గా తయారు చేయండి
పిల్లలు రంగులు, వివిధ ఆకృతులు కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. కావున ఇంట్లోనే పిల్లలకు రంగురంగుల, ఆసక్తికరమైన ఆహారాన్ని సిద్ధం చేయండి. ఆహారంపై పిల్లల ఆసక్తిని పెంచండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.