Hacks: ఇంట్లో చీమలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయా..? ఇలా చేయండి

ఇంట్లో చీమల నివారణకు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి. సాల్ట్ వాటర్ స్ప్రే, వైట్ వెనిగర్, పుదీనా ఆయిల్ స్ప్రే. వీటి నుంచి వచ్చే వాసనను చీమలు తట్టుకోలేవు. దీంతో ఇంట్లో చీమల బెడద తగ్గుతుంది. ఈ స్ప్రేస్ తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Hacks: ఇంట్లో చీమలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయా..? ఇలా చేయండి

Hacks: వేసవి కాలం ప్రారంభమైన వెంటనే, తేమ, వేడితో పాటు ఇంట్లో చీమల భాద కూడా ఎక్కువవుతుంది. ఈ చీమలను వదిలించుకోవడానికి మార్కెట్ లో రకరకాల స్ప్రేలు, మందులు కోసం వెతుకుతుంటారు. అయినప్పటికీ సమస్య అలాగే ఉంటుంది. అయితే మీరు ఇంట్లో ఈ చీమల భాద నుంచి బయటపడాలంటే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి. ఇవి చీమలను తరిమేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇంటి చిట్కాలతో చీమలను వదిలించుకునే మార్గాలు

ఉప్పు

ఇంట్లోకి చీమలు ప్రవేశించే మూలలో ఉప్పు వేయండి. దీని కోసం ముందుగా నీటిని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత, దానిలో కొంచెం ఎక్కువ ఉప్పును వేసి కరిగించండి. ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి ఇంట్లో చీమలు వచ్చే చోట చల్లుకోండి.

వైట్ వెనిగర్

చీమలు వైట్ వెనిగర్ వాసనను పూర్తిగా తట్టుకోలేవు. ఈ వెనిగర్ రెమెడీని
తయారు చేయడానికి నీరు, వెనిగర్ సమన భాగంలో తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపిన ద్రవంలో కొన్ని చుక్కల నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని చీమలు వచ్చే ప్రదేశంలో చల్లాలి.

publive-image

పుదీనా

పుదీనా సహాయంతో ఇంట్లో తిరిగే చీమలను దూరం చేసుకోవచ్చు. నిజానికి చీమలకు పుదీనా వాసన అస్సలు నచ్చదు. పిప్పరమెంటు వాసనను చీమలు తట్టుకోలేవు. అటువంటి వాసన వచ్చే ప్రదేశాలకు రావు. దీని కోసం ఒక కప్పు నీటిలో 10 చుక్కల పిప్పరమెంటు నూనెను వేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చీమలు వచ్చిన ప్రతిచోటా చల్లాలి. ఈ రెమెడీని రోజుకు రెండు సార్లు రిపీట్ చేయండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Also Read: Ice Apple: తాటి ముంజలు.. రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా అదుర్స్..!hacks

Advertisment
తాజా కథనాలు