5 Habits Of Jealousy : రోజంతా, మీరు ఇంటి నుంచి ఆఫీసు వరకు చాలా మందిని కలుస్తారు, కానీ వారిలో కొందరు వ్యక్తులు మీ బలాలపై తక్కువ, మీ లోపాలపై ఎక్కువ దృష్టి పెడతారు. వాస్తవానికి, రోజంతా మీతో ఉండే వ్యక్తుల్లో కొంత మంది మీ పట్ల నిజమైన విధేయత కలిగి ఉంటారు. మరి కొంతమంది పైకి మంచిగా నటిస్తూ మనసులో మీ పై విపరీతమైన అసూయతో ఉంటారు. ఇలాంటి వ్యక్తులను గుర్తించడం అంత సులభం కాదు. ఇలా ఎదుటి వ్యక్తి పై అసూయ(Jealousy) తో ఉన్నవారిని కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
అసూయపడేవారిలో కనిపించే 5 సంకేతాలు
ఇతరుల ముందు మిమల్ని అవమానించడం
మీ పై అసూయతో ఉన్నవారు ప్రతీ క్షణం మిమల్ని అవమానించాలని ప్రయత్నిస్తారు. ఎదుటివారి ముందు మిమల్ని అవమానించి తమను తాము ఉత్తముడిగా నిరూపించుకోవాలని ఆలోచిస్తారు.
ప్రతి క్షణం కాపీ చేయడం
మీ పై అసూయపడే వ్యక్తి తాము కూడా మీలా ఉండాలని అనుకుంటారు. ఎల్లప్పుడూ మిమల్ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తారు. తాము కూడా తక్కువేమి కాదని నిరూపించుకోవడానికి చూస్తారు. నిలబడి ఉన్న విధానం నుంచి, ఆహారపు అలవాట్లు(Food Habits), బట్టల వరకు మిమ్మల్నే అనుసరిస్తారు. ఇవన్నీ అసూయ నుంచి పుట్టే అలవాట్లు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అలవాట్లు నిజమైన స్ఫూర్తి నుంచి కలిగేవి కూడా కావచ్చు.
తమను ఇతరులతో పోల్చుకోవడం
అసూయపడే వ్యక్తులు ప్రతి క్షణం తమను ఇతరులతో పోల్చుకుంటారు. మీ స్నేహితులు ఎవరైనా ప్రతి పనిలో మీతో పోల్చుకుంటే, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులు తమను తాము ఇతరులకన్నా గొప్ప అని చెప్పుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు.
లోపాలను కనుగొనడం
మీ పై అసూయతో ఉన్నవారు ఎల్లప్పుడూ మీ బలాలను కాకుండా మీలోని బలహీనతలు(Weakness), లోపాలను వెతకడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని గొప్పగా మిమల్ని తప్పుగా నిరూపించాలని ఆలోచిస్తారు.
మీ గెలుపును తట్టుకోలేకపోవడం
ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రశంసించినప్పుడు, మీ పనిని మెచ్చుకున్నప్పుడు.. మీ పై అసూయపడే వ్యక్తులు నిరాశ చెందుతారు. వారు మీకు చెడు ప్రచారాన్ని ఇవ్వడమే కాకుండా ఎలాంటి ప్రశంసలను రావడానికి ఇష్టపడరు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Baby Care : వేసవిలో పిల్లల చర్మం పై వేడి దద్దుర్లు ఎందుకు వస్తాయి.? తప్పక తెలుసుకోండి..!