Nut Health : నట్స్ తింటే బరువు పెరుగుతారా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి.?

ఆరోగ్యంగా ఉండటానికి నట్స్ తినడం మంచిది. అయితే నట్స్‌లో ఉండే కొవ్వుల వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీని గురించి పరిశోధనలు ఏమి చెబుతున్నాయి, వాస్తవం ఏమిటో తెలుసుకుందాం.

Nut Health : నట్స్ తింటే బరువు పెరుగుతారా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి.?
New Update

Weight Gain : నిపుణులు పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? నట్స్ ప్రోటీన్స్ , విటమిన్స్ , మినరల్స్, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి బరువు నిర్వహణలో సహాయపడుతూ మరింత శక్తిని ఇస్తాయి. అలాగే అధిక కేలరీలు కొవ్వును కలిగి ఉంటాయి. అందుకే నట్స్(Nuts) తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ పరిశోధనల ప్రకారం, సాల్ట్ ఫ్రీ నట్స్(Salt Free Nuts) గింజలను తినడం వల్ల శరీరంలో ఎక్కువ శక్తిని పొందడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అయితే సమతుల్య ఆహారంలో భాగంగా వాటిని మితంగా కానీ క్రమం తప్పకుండా తింటే, మీరు బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు.

వాస్తవాలు ఏమి చెబుతున్నాయి..?

పరిశోధన ప్రకారం, డైలీ డైట్ లో నట్స్ స్నాక్ లా తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే బరువు తగ్గాలనుకుంటే(Weight Loss) మాత్రం గింజలను చిరుతిండిగా తినకండి. నట్స్‌లో 600 నుంచి 650 క్యాలరీలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక పూర్తి మీల్ కు సమానం. అటువంటి పరిస్థితిలో, మీరు భోజనానికి బదులుగా గింజలను తినవచ్చు. అలా కాకూండా మోతాదుకు మించి తింటే బరువు పెరుగుతారు.

publive-image

ఎంత నట్స్ తినాలి

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, పొరపాటున కూడా స్నాక్ రూపంలో ఎక్కువగా నట్స్ తినకండి. ఎందుకంటే నట్స్‌లోని పోషకాలు, కేలరీలు , కొవ్వు ప్రకారం, ఒక రోజులో 15-20 గ్రాముల గింజలను మాత్రమే తినడం మంచిది. అంతకు మించి తింటే బరువు పెరగడానికి కారణమయ్యే ప్రమాదం ఉందని నిపుణుల సూచన.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల(Health Problems) నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Manali Vacation: మనాలిలో చాలా తక్కువ మందికి తెలిసిన అద్భుతమైన ప్రదేశాలు..! మీకు తెలుసా..?

#life-style #weight-loss #weight-gain #eating-nuts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe