Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..!

సాధారణంగా కూరగాయలను ఉడికించి తింటారు. అయితే కొన్ని కూరగాయలను మాత్రం అతిగా ఉడికించకూడదని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల కూరగాయల్లోని పోషక విలువలు తగ్గుతాయని చెబుతున్నారు. బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో, క్యారెట్,క్యాప్సికమ్ వంటి వాటిని ఎక్కువగా ఉడికించకూడదు.

Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..!
New Update

Health: ఆహార రుచిని పెంచడానికి పచ్చి కూరగాయలను ఉడికించడం, వాటికి మసాలాలు జోడించడం సహజం. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా మంచిదే. అయితే కొన్ని కూరగాయలను మాత్రం అతిగా ఉడికించకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఎక్కువగా ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గుతాయి. ఇలాంటి కూరగాయలను తిన్నప్పటికీ శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అతిగా ఉడికించకూడని కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..

బచ్చలికూర

బచ్చలికూరలో(Spinach) ఐరన్, విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరను అతిగా ఉడికించడం వల్ల దీనిలోని విటమిన్ సి నశిస్తుంది. అందుకే బచ్చలికూరను వండేటప్పుడు తక్కువ మంటపై కొద్దిగా ఉడికించాలి.

టొమాటో

ఓ అధ్యయనంలో కార్నెల్ యూనివర్శిటీ పరిశోధకులు టమాటోలను అతిగా ఉడికించడం వల్ల విటమిన్ సి కంటెంట్ తగ్గుతుందని వెల్లడించారు. 2 నిమిషాలు ఉడికించిన టమాటోలో ఉడికించని టమాటో కంటే 10% తక్కువ విటమిన్ సి ఉన్నట్లు తెలిపారు. అలాగే 30 నిమిషాలు వండిన టమాటోలో 29% తక్కువ విటమిన్ సి ఉన్నట్లు కనుగొన్నారు.

publive-image

పచ్చి బఠానీలు

పచ్చి బఠానీలలో విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువ. అయితే చాలా మంది బఠానీలను ఉడికించి తింటారు. కానీ అలా చేయడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ బి కోల్పోవడం ప్రారంభమవుతుంది.

బ్రోకలీ

బ్రోకలీ యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్ C, K వంటి పోషకాలకు పవర్‌హౌస్ గా పిలవబడుతుంది. దీనిని ఎక్కువగా ఉడికించడం వల్ల పోషకాలు నశిస్తాయి.

క్యారెట్
క్యారెట్‌లోని బీటా కెరోటిన్ వంటి పోషకాహార ప్రయోజనాలను పూర్తిగా పొందాలనుకుంటే.. వాటిని ఉడికించడానికి బదులుగా  సలాడ్‌ రూపంలో పచ్చిగా తీసుకోండి.

క్యాప్సికమ్

క్యాప్సికమ్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. దీనిని అధిక మంట మీద ఉడికించినప్పుడు, విటమిన్ సి అంతా నశిస్తుంది. అందువల్ల దీనిని పచ్చిగా లేదా కొద్దిగా ఉడికించి తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

Also Read: Kiran Abbavarm: "మీ ఆశీస్సులు మాకు కావాలి" పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కిరణ్ అబ్బవరం - Rtvlive.com

#life-style #vegetables
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe