Alcohol: సోడాతో ఆల్కహాల్ తాగుతున్నారా..? అయితే ఆరోగ్యం జాగ్రత్త..! సాధారణంగా ఆల్కహాల్ ను నీటితో కంటే సోడాతో ఎక్కువ కలిపి తాగుతుంటారు. ఆల్కహాల్‌లో సోడా కలపడం ఆరోగ్యానికి హాని అని నిపుణుల అభిప్రాయం. సోడాలో ఫ్రక్టోజ్, కెఫిన్ ఫాస్పోరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి స్థూలకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె సమస్యలకు దారితీస్తాయి. By Archana 08 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Alcohol: ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, దీనిని తాగే వారి సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఆల్కహాల్ తాగడం మాత్రమే కాదు సరైన పద్దతిలో, పరిమాణంలో తీసుకోకపోయిన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అసలు ఎంత ఆల్కహాల్ తీసుకోవాలి, దానిని తాగడానికి సరైన మార్గమేంటి ఇప్పుడు తెలుసుకుందాము. సోడాతో ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది..? చాలా మంది ఆల్కహాల్ ను నీటితో కంటే సోడాతో ఎక్కువ కలిపి తాగుతుంటారు. అయితే ఆల్కహాల్‌లో సోడా కలపడం ఆరోగ్యానికి హాని అని నిపుణుల అభిప్రాయం. నివేదికల ప్రకారం ఆల్కహాల్ ను సోడాతో తాగేవారు మిగతా వారికంటే ఎక్కువ మత్తులో కూరుకుపోతారని చెబుతున్నాయి సోడాలో సాధారణంగా కార్బోనేటేడ్ వాటర్, అధిక ఫ్రక్టోజ్, కలర్, కెఫిన్, ఫాస్పోరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్థూలకాయం నుంచి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. వివిధ రకాల సోడాలు, కార్బోనేటేడ్ పానీయాలు, శీతల పానీయాలలో ఫాస్ఫరస్ ఉంటుంది. వీటితో కూడిన మద్యాన్ని అధిక మొత్తంలో తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్‌లో సోడా , వైన్ కలపడం కంటే నీరు కలపడం మంచిది. కాస్త గోరువెచ్చ నీరైతే మరీ మంచిది. నీటితో తాగడం వల్ల ఆల్కహాల్ కరిగిపోతుంది. ఇది దాని తీవ్రత, మత్తును తగ్గిస్తుంది. అలాగే హ్యాంగోవర్ సంభావ్యతను కూడా తగ్గిస్తుంది. ఒక వ్యక్తి ఎంత మద్యం తాగాలి విస్కీ తాగడానికి ఒక సురక్షితమైన పరిమాణం అంటూ లేదని నివేదికలు చెబుతున్నాయి. కాకపోతే మితమైన పరిమాణంలో తాగడం ఆరోగ్యానికి మంచిది. రోజుకు స్త్రీలు 25 ml, పురుషులు 50 ml విస్కీ తీసుకోవడం మంచిదని నిపుణుల సూచన గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: Mr.Bachchan : 'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్, మాస్ రాజా యాక్షన్ అదుర్స్! - Rtvlive.com #health-tips #alcohol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి