Nutmeg Milk: ప్రశాంతమైన నిద్ర కోసం జాజికాయ పాలు.. ఆ సమస్యలు కూడా పరార్..? పాలలో జాజికాయ పొడి కలిపి తాగితే ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు నిపుణులు. ఇవి నాణ్యమైన నిద్రను అందించడంలో సహాయపడతాయి. జాజికాయలోని పోషకాలు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, చికాకు వంటి సమస్యలను తొలగిస్తాయి. మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుతాయి. By Archana 09 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Nutmeg Milk: రాత్రిపూట ఒక గ్లాసు వేడి పాలు తాగడం వల్ల మలబద్దకం సమస్య తొలగిపోతుందని చెబుతారు. ఇది ఉదయాన్నే పొట్టను సులువుగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాదు పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాలలోని క్యాల్షియం, పుష్కలమైన పోషకాలు రోగనిరోధక శక్తి, ఎముకలను బలోపేతం చేస్తాయి. అయితే పాలను అనేక విధాలుగా తీసుకుంటారు. కొంతమంది పసుపు పాలు తాగుతార. మరికొందరు సాదాగా తాగడానికి ఇష్టపడతారు. అలాగే పాలలో జాజికాయ పొడి కలుపుకుని తాగితే ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు నిపుణులు. జాజికాయ పాలు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము.. పాలలో జాజికాయ కలుపుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు నివేదికల ప్రకారం.. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ కలుపుకుని తాగితే నిద్ర బాగుంటుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. అలాగే నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. తద్వారా ఫ్రెష్ మూడ్ తో ఉదయాన్నే నిద్ర లేస్తారు. జాజికాయ పొడి పాలు మెదడు పనితీరు సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. ఆందోళన, ఒత్తిడి సమస్యలు ఉన్నవారికి జాజికాయ పాలు మంచి చిట్కాల పని చేస్తాయి. అంతే కాదు జీర్ణ సమస్యలను కూడా తొలగిస్తాయి. జాజికాయలో కాపర్, మెగ్నీషియం, విటమిన్ బి6, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తి వాటి నియంత్రణకు అవసరం. అలాగే ఈ పోషకాలు స్లీప్ సైకిల్ ను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జాజికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతాయి. ఇది శరీర బలాన్ని పెంచుతుంది. క్యాన్సర్ వంటి అనేక తీవ్రమైన వ్యాధుల సమస్యను తగ్గించుకోవచ్చు. జాజికాయ పొడిని చిటికెడు పాలలో కలిపి తాగడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత సమతుల్యం అవుతుంది. ఇది మహిళల్లో పునరుత్పత్తి(reproductive health) ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుతుంది. అలాగే నెలసరికి సంబంధించిన సమస్యలలో ఒక గ్లాసు గోరువెచ్చని జాజికాయ పాలు తాగడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా జాజికాయ పాలు తాగవచ్చు. ఇందులోని పోషకాలు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి జాజికాయ పాలు సరైన ఎంపిక. ఇవి అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, చికాకు వంటి సమస్యలను తొలగిస్తాయి. అలాగే జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. Also Read: Airtel Offers: ఎయిర్టెల్. యూజర్లకు గుడ్ న్యూస్.. 20కి పైగా ఓటీటీ ఆఫర్లతో రీచార్జ్ ప్లాన్స్..! #nutmeg-milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి