Airtel Offers: ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. 20కి పైగా ఓటీటీ ఆఫర్లతో రీచార్జ్ ప్లాన్స్..!

ఎయిర్టెల్ తమ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ యూజర్లకు శుభవార్తను అందించింది. రూ.3359 ప్లాన్‌తో 2.5GB డైలీడేటా,1ఇయర్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అంతేకాదు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేలో 20కి పైగా Ott ప్లాట్ ఫార్మ్‌లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అన్లాక్ చేసుకోవచ్చు.

New Update
Airtel Offers: ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. 20కి పైగా ఓటీటీ ఆఫర్లతో రీచార్జ్ ప్లాన్స్..!

Airtel OTT Recharge Plans: డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందే సరికొత్త ప్లాన్లను ఎయిర్టెల్ విడుదల చేసింది. 2024 టీ20 వరల్డ్ కప్పు (T20 World Cup) దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఇది కాకుండా, కంపెనీ మరికొన్ని ప్రత్యేక అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను కూడా అందిస్తోంది.

ప్రీపెయిడ్ యూజర్లకు డిస్నీ + హాట్స్టార్ యాక్సెస్ మూడు నెలల పాటు లభిస్తుంది. వీరికి 20కి పైగా ఓటీటీ సేవలతో కూడిన ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లేకు కూడా యాక్సెస్ లభిస్తుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ రీఛార్జ్ ప్లాన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులను డిస్నీ + హాట్స్టార్ బండిల్ ప్లాన్ ను రూ .499 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఇప్పుడు కంపెనీ వేర్వేరు వాలిడిటీ, నెలవారీ డేటా పరిమితులతో మూడు ప్లాన్లను అద్భుతమైన ఓటీటీ ఆఫర్లతో అందుబాటులో ఉంచింది.

ఈ జాబితాలో అత్యంత ఖరీదైన ప్లాన్ రూ .3,359. దీనితో సంవత్సరం పాటు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కు సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అంతే కాదు ఈ ప్లాన్ ద్వారా ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లేలో 20కి పైగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అన్లాక్ చేసుకోవచ్చు.

Airtel OTT Recharge Plans

ఎయిర్ టెల్ రూ.499 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో కస్టమర్లకు ప్రతిరోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. అదనంగా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రయోజనం కూడా ఇందులో ఇవ్వబడింది.

ఎయిర్ టెల్ రూ.869 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఇందులో కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. అదనంగా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రయోజనం కూడా ఇందులో ఇవ్వబడింది.

ఎయిర్ టెల్ రూ.3359 ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. ఇందులో వినియోగదారులకు ప్రతిరోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ప్లాన్ లో డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను 1 సంవత్సరం పాటు ఉచితంగా ఇస్తారు. అదనంగా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రయోజనం కూడా ఇందులో ఇవ్వబడింది.

Also Read: OTT Trending: ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సీరీస్, సినిమాలు.. షాకయ్యే రేటింగ్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు