Hair Care : జుట్టుకు గుడ్డు అప్లై చేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!

జుట్టు సంరక్షణ కోసం చాలా మంది గుడ్డును అప్లై చేయడం చేస్తుంటారు. అయితే జుట్టుకు గుడ్డును అప్లై చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

Hair Care : జుట్టుకు గుడ్డు అప్లై చేసే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
New Update

Apply Egg To Hair : జుట్టు ఒత్తుగా, పొడవుగా, మెరిసేలా చేయడానికి చాలా మంది గుడ్డును అప్లై చేయడం చేస్తుంటారు. ఉపయోగిస్తారు. అయితే జుట్టు పై గుడ్లు అధికంగా ఉపయోగించడం వల్ల హాని కలుగుతుంది చెబుతున్నారు నిపుణులు. జుట్టు సంరక్షణ కోసం గుడ్డు చాలా మంచిది. కానీ అధిక వినియోగం హానీ కలిగిస్తుంది. అయితే జుట్టుకు గుడ్డును అప్లై చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

జుట్టు రాలడం

ఎగ్ హెయిర్ మాస్క్‌ (Egg Hair Mask) ని అప్లై చేయడం ద్వారా జుట్టు బలంగా, మృదువుగా మారుతుంది. అయితే గుడ్డులోని పచ్చసొనను జుట్టుకు పట్టించడం చుండ్రు (Dandruff) సమస్యకు దారితీస్తుంది. దీని వల్ల వచ్చే దురద, చికాకు వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తుంది. దీని కారణంగా జుట్టు నిర్జీవంగా బలహీనంగా మారుతుంది. అలాగే వెంట్రుకలు విరిగిపోవడం జరుగుతుంది.

చుండ్రు

స్కాల్ప్ జిడ్డుగా మారినప్పుడు, చుండ్రు సమస్య పెరుగుతుంది. గుడ్డులోని పసుపు భాగం జుట్టు, తలలో చుండ్రును పెంచుతుంది. ఈ సమస్యను నివారించడానికి, జుట్టుకు గుడ్డులోని తెల్లసొనను మాత్రమే రాసుకోవాలి.

జిడ్డుగల జుట్టు

పొడి జుట్టు ఉన్నవారికి, ఎగ్ హెయిర్ మాస్క్ జుట్టును సిల్కీగా, మృదువుగా చేయడానికి పనిచేస్తుంది. అయితే జిడ్డు స్వభావం కలిగిన జుట్టు ఉన్నవారు గుడ్డు రాసుకోవడం మానుకోవాలి. అలాంటి వెంట్రుకలపై గుడ్డును అప్లై చేయడం వల్ల జుట్టు, స్కాల్ప్ మరింత జిడ్డుగా మారతాయి. దీని వల్ల తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్ (Infection) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

జుట్టులో దుర్వాసన రావడానికి కారణం

గుడ్డు పచ్చసొనను జుట్టుకు పట్టించడం వల్ల దుర్వాసన (Bad Smell) వస్తుంది. నిజానికి, గుడ్డు పచ్చసొనలో ఉండే మూలకాలు జుట్టు సహజ నూనెలతో కలిసిపోయి వాసనను ఉత్పత్తి చేస్తాయి. ఇది కొన్నిసార్లు తట్టుకోవడం కష్టం అవుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Bread Rolls: పిల్లలు ఎంతో ఇష్టపడే క్రిస్పీ బ్రెడ్ రోల్స్.. ట్రై చేయండి - Rtvlive.com

#hair-fall #hair-care #egg-hair-mask
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe