Pregnancy: ప్రెగ్నెన్సీలో లిప్ స్టిక్, ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..!

గర్భధారణ సమయంలో కొన్ని రకాల కాస్మొటిక్ ఉత్పత్తుల వాడకం ప్రమాదమని చెబుతున్నారు నిపుణులు. ఫెయిర్‌నెస్ క్రీమ్, సిలిసిక్ యాసిడ్, రోజ్మేరీ ఆయిల్, లిప్ స్టిక్, హెయిర్ కలర్, పారాబెన్ ఉత్పత్తులు. వీటిలోని రసాయనాలు పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు హాని కలిగించే అవకాశం ఉంది.

New Update
Pregnancy: ప్రెగ్నెన్సీలో లిప్ స్టిక్, ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..!

Pregnancy Tips: గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది తమ భద్రతకు మాత్రమే కాకుండా కడుపులో పెరుగుతున్న పిల్లల భద్రతకు కూడా అవసరం. అయితే గర్భధారణ సమయంలో ఆహారంతో మాత్రమే కాదు చర్మ ఉత్పత్తులు వాడే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
ఈ రోజుల్లో అమ్మాయిలు తమ అందం కోసం క్రీమ్, ఫౌండేషన్, లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ వంటి అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. గర్భధారణ సమయంలో అందంతో పాటు పిల్లల ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో కొన్ని కాస్మొటిక్ ఉత్పత్తులు వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

గర్భధారణ సమయంలో కాస్మొటిక్స్ నివారణ ఎందుకు ముఖ్యం?

గర్భధారణ సమయంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు చర్మంపై కనిపిస్తాయి. కొన్నిసార్లు చర్మం చాలా సున్నితంగా మారుతుంది. అందుకే ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదని తరచుగా వైద్యులు సలహా ఇస్తుంటారు.

ఫెయిర్‌నెస్ క్రీమ్

ఫెయిర్‌నెస్ క్రీమ్‌లలో హైడ్రోక్వినోన్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేసే ఉత్పత్తి.కానీ ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రెగ్నెన్సీ సమయంలో పొరపాటున కూడా వాడకూడదు. ఇందులోని హైడ్రోక్వినాన్ రసాయనం ప్రతికూల ప్రభావాలను చూపే ప్రమాదం ఉంది. .

పారాబెన్ రసాయన

పారాబెన్స్ అనేది ఒక రకమైన కాస్మొటిక్ ప్రెజర్వేటివ్. సౌందర్య ఉత్పత్తులు చెడిపోకుండా నిరోధిస్తుంది. ఏదైనా సబ్బు, షాంపూ, కండీషనర్, బాడీ లోషన్, స్క్రబ్‌లో పారాబెన్‌లు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు దీనిని పూర్తిగా వాడకూడదు. పారాబెన్స్ రసాయనాల ప్రభావం గర్భస్రావం, తక్కువ బరువుతో పుట్టడం, ఊబకాయం లేదా పిల్లల మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.

ఎసెన్షియల్ ఆయిల్స్

ఎసెన్షియల్ ఆయిల్స్ ను సహజంగా భావిస్తాము. కానీ ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ కొన్నిసార్లు గర్భధారణను కష్టతరం చేస్తాయి. దీని వల్ల ప్రసవ నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు పెరుగుతాయి. రోజ్మేరీ ఆయిల్, సేజ్ ఆయిల్, జాస్మిన్ ఆయిల్ సమయానికి ముందే ప్రసవ నొప్పిని పెంచుతాయి. ఇది పిల్లలకి ప్రమాదకరం.

సిలిసిక్ యాసిడ్

ఈ రోజుల్లో అమ్మాయిలు తమ చర్మంపై సిలిసిక్ యాసిడ్ కెమికల్ కలిగిన ఉత్పత్తులను అప్లై చేస్తున్నారు. తద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. కానీ ఈ రసాయనం వల్ల గర్భధారణ సమయంలో సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

హెయిర్ కలర్

అమ్మోనియా రసాయనాన్ని కలిగి ఉన్న జుట్టు రంగులు. గర్భిణీ స్త్రీలు ఆ జుట్టు రంగులను ఉపయోగించకూడదు. ఇది మహిళల చర్మానికే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా హానికరం.

లిప్ స్టిక్

లిప్‌స్టిక్‌లో ఉండే హానికరమైన కెమికల్ సీసం కడుపులోని బిడ్డకు ప్రమాదకరం. లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల నోటిలోకి వెళ్లి పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది.

హెయిర్ రిమూవల్ క్రీమ్

హెయిర్ రిమూవల్ క్రీమ్‌లలో థియోగ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. గర్భధారణ సమయంలో సంభవించే హార్మోన్ల మార్పుల వల్ల ఇది హానికరం. ఈ రసాయనం గర్భిణీ స్త్రీకి హాని కలిగించే అలెర్జీని కారణమవుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Tooth Brush : టూత్ బ్రష్ ను ఇలా కవర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!

Advertisment
తాజా కథనాలు