Piles Causes : ఈ అలవాట్లు ఉంటే పైల్స్ వచ్చే ప్రమాదం.. జాగ్రత్త.!

కొంత మందిలో పైల్స్ సమస్య బాగా వేధిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాలు. ఈ సమస్య రావడానికి గల కారణాలు ఇవే. మలబద్దకం, మద్యపానం, ఎక్కువ మసాల, ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్స్, తక్కువ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం దీనికి ప్రధాన కారణాలు.

New Update
Piles Causes : ఈ అలవాట్లు ఉంటే పైల్స్ వచ్చే ప్రమాదం.. జాగ్రత్త.!

Piles :  మలబద్దకం, తీవ్రమైన డైయేరియా, అలాగే మోషన్ ఫ్రీగా లేని వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాలు ఈ సమస్య పై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. పైల్స్(Piles) రావడానికి గల కారణాలు ఏంటో చూడండి..

మలబద్దకం

రోజూ తినే ఆహారంలో ఫైబర్ శాతం తీసుకోవడం వల్ల మలబద్దకం వంటి జీర్ణక్రియ సమస్యల పై ప్రభావం చూపుతుంది. మలబద్దకం మోషన్ ఫ్రీ గా చేయడంలో ఇబ్బందిని కలిగించి.. పైల్స్ సమస్యకు కారణమవుతుంది.

గంటల తరబడి కూర్చోవడం

చాలా మంది ఆఫీస్ లో గంటల తరబడి ఒకే చోట కూర్చొని పని చేస్తారు. ఇలా చేస్తే పైల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పని మధ్యలో ఒక గంట సేపు అటు ఇటు తిరగడం లేదా విరామం తీసుకోవడం చేయాలి

మద్యపానం

ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. దీని వల్ల మలబద్దకం సమస్య ఏర్పడి.. అది పైల్స్ వచ్చే ప్రమాదాన్ని తీవ్రం చేస్తుంది. ముందుగానే ఈ సమస్య ఉన్నవారు వీటికి తక్కువగా తీసుకుంటే మంచిది.

తక్కువగా నీళ్లు తాగడం

కొందరు రోజుకు కనీసం 3 లీటర్స్ నీళ్లు కూడా తాగారు. శరీరానికి కావాల్సినంత నీళ్లు తాగకపోతే మోషన్ ఇబ్బందిగా ఉంటుంది. దాని వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రోజు 4 లీటర్స్ నీళ్లు తాగేలా చూసుకోవాలి.

మాంసాహారం

నాన్ వెజ్ తినేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మాంసాహారం(ప్రాసెస్డ్ రెడ్ మీట్ ) లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. అలాగే వీటిలోని హై సాల్ట్ స్పైస్ కూడా పైల్స్ రావడానికి కారణవుతుంది. ఎక్కువగా ఫైబర్ కలిగిన ఫుడ్స్ తీసుకోవడం మంచిది.

స్పైసీ ఫుడ్స్

చాలా మంది బయట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటుంటారు. వీటిలోని మసాలాలు, స్పైసెస్ పైల్స్ సమస్యకు కారణమవుతాయి. ఫ్రెంచ్ ఫ్రెయిస్ , చిప్స్, మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

Also Read: Hair Care: జుట్టు రాలుతుందా? డాన్‌డ్రఫ్‌ వేధిస్తుందా? ఈ చిన్న చిట్కా పాటించండి చాలు!

Advertisment
తాజా కథనాలు