Planting : బాల్కానీలోని ఈ ఏడు మొక్కలు ఆరోగ్యానికి ఔషధం..! తప్పక నాటండి

ఇంటి బాల్కనీలో ఈ 7 మొక్కలను పెంచడం చాలా ప్రయోజనకరం. అపరాజిత, స్టెవియా, కరివేపాకు, పుదీనా, కలబంద, నిమ్మగడ్డి, చమోమిలే మొక్కలు. ఇవి పుష్కలమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటి ఆకులతో చేసే పానీయాలు మధుమేహం, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

Planting : బాల్కానీలోని ఈ ఏడు మొక్కలు ఆరోగ్యానికి ఔషధం..! తప్పక నాటండి
New Update

7 Medicinal Plants : పర్యావరణ పరిరక్షణ (Environmental Protection) కోసం మొక్కలు నాటడం (Planting Trees) చాలా ముఖ్యం. మొక్కలు కేవలం పర్యావరణాన్ని రక్షించడం మాత్రమే కాదు , ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే ఇంటి ప్రదేశాల్లో, బయట మొక్కలు నాటమని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. అయితే ఈ 7 రకాల మొక్కలను ఇంటి బాల్కనీలో నాటడం చాలా ప్రయోజనకరం. ఇవి పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

అపరాజిత మొక్క

అందమైన నీలిరంగు పువ్వులతో కూడిన ఈ మొక్క సులభంగా పెరుగుతుంది.  ఈ మొక్క ఆకుల ద్వారా తయారు చేసే బ్లూ టీ (Blue Tea) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం (Diabetes), రక్తపోటు, జీర్ణక్రియ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మొక్కలో కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తులను పోత్సహించే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి.

స్టెవియా

మధుమేహ రోగులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. స్టెవియా మొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది చక్కెర ప్రత్యామ్నాయం. ఇంట్లో ఒక కుండలో దీన్ని సులభంగా పెంచవచ్చు. ఇంట్లో చక్కెరను ఉపయోగించకపోతే స్టెవియా ఆకులను జోడించడం ద్వారా తీపిని పొందవచ్చు.

పుదీనా

పుదీనా ఆకులు (Mint Leaves) రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పుదీనా ఆకులతో చేసిన పానీయాలు తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్-బ్లోటింగ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో పుదీనా టీ కడుపుని చల్లబరుస్తుంది.

నిమ్మ గడ్డి మొక్క

నిమ్మ గడ్డి మొక్క సహాయంతో సులభంగా పెరుగుతుంది. లెమన్ గ్రాస్ కడుపు వాపు, అజీర్ణం, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. నిమ్మ గడ్డి టీ ఆరోగ్యం పై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

publive-image

కరివేపాకు

ఇంటి బాల్కనీలో కరివేపాకు మొక్క ఉండడం చాలా ప్రయోజనకరం. ఇది ఆహారంలో రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కరివేపాకుతో జుట్టు ఒత్తుగా, పొడవుగా తయారవుతుంది.

కలబంద

కలబంద గుజ్జును చర్మం, జుట్టు మీద అప్లై చేసి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల అనేక ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కావున ఇంట్లో ఈ మొక్కను పెంచడం చాలా ప్రయోజనకరం. ఒకటి గుర్తుంచుకోవాలి కలబంద గుజ్జును మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యం.

చమోమిలే

చమోమిలే టీ తాగడం వల్ల నిద్రలేమి నుంచి తలనొప్పి వరకు అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మొక్కను కుండలో సులభంగా పెంచవచ్చు. కొంచెం జాగ్రత్త అవసరం. ఈ తెలుపు రంగు మొక్కలు అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: ఇది కూడా చదవండి: ఈ చిట్కాలను పాటించండి.. జూన్, జులై మొత్తం సంతోషంగా గడిచిపోతుంది!

#environmental-protection #plants #blue-tea
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe