Life Style: జీవితంలో ఈ అలవాట్లే మీ బాధకు కారణమవుతాయి..! జాగ్రత్త..!

ఒక వ్యక్తిలో ఒత్తిడి, కోపం, బాధ, నిరాశకు.. ఈ మూడు అలవాట్లు ముఖ్య కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇతరులతో పోల్చుకోవడం, ఎదుటివారు తమకు అనుగుణంగా ఉండాలనుకోవడం, ప్రతీ విషయానికి ఫిర్యాదు చేయడం. ఈ అలవాట్లు మనిషిని ఆనందానికి దూరం చేస్తాయి.

Life Style: జీవితంలో ఈ అలవాట్లే మీ బాధకు కారణమవుతాయి..! జాగ్రత్త..!
New Update

Life Style: చాలా మంది తరచుగా విచారం, ఒత్తిడితో బాధపడుతుంటారు. జీవితంలోని చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించకపోవడమే కాకుండా వాటిలో లోపాలను వెతకడం, ఎల్లప్పుడూ బాధగా, చిరాకుగా ఉంటారు. వారు తమ కనిపించే మంచితనం, ఆనందం గురించి పట్టించుకోరు.

ఇలాంటి వారి ప్రవర్తనకు ఈ మూడు ముఖ్య కారణాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

ఇతరులతో పోల్చడం అలవాటు

ఇతరులతో పోల్చడం చాలా మందికి అలవాటు. స్నేహితులు, కుటుంబం లేదా పరిచయస్తుల విజయాల గురించి ఆలోచిస్తూ బాధపడటం, వారికి ఏమీ మంచి జరగకూడదని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండటం. ఈ అలవాటు ఉన్నవారు వారి సంతోషాన్ని వారే దూరం చేసుకు న్నట్లు. ఇది వారి జీవితంలో తక్కువ అనే భావనను కలిగిస్తుంది. ఈ భావన మనిషిని సంతోషానికి దూరం చేస్తుంది.

publive-image

ఇతరుల స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నించడం 

చాలా మంది వ్యక్తులు తమ చుట్టూ ఉన్న వ్యక్తులను తమకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ప్రతిదీ వారి కోరిక ప్రకారం కావాలని అనుకుంటారు. అలా జరగకపోతే బాధ, నిరాశ, చిరాకు, ఒత్తిడికి గురవుతారు. ఇతరుల ప్రవర్తన, అలవాట్లను మార్చడానికి ప్రయత్నించే బదులు, సొంత అలవాట్లు , ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆనందంగా ఉండడం సులభం అవుతుంది.

ఫిర్యాదు చేయడం

ప్రతి చిన్న, పెద్ద విషయానికి ఫిర్యాదు చేయడం, లోపాలను లెక్కించడం. ఎప్పుడూ తప్పులు వెతుక్కుంటూ ఫిర్యాదు చేసే ఈ అలవాటును మానేయండి. ఇవి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయడమే కాదు కోపాన్ని కలిగిస్తాయి.

Also Read: Health Tips : రాత్రి నేల పై ఇలా చేయండి.. అవి తగ్గిపోతాయి..!

#healthy-habits #stress-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe