ప్రాణహాని ఉంది.. నా గ‌న్ లైసెన్స్ రెన్యువ‌ల్ చేయండి: న‌టుడు న‌రేష్

నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమా పరంగా సంబంధించుకున్న పేరు కంటే నిజ జీవితంలో ఎక్కువ పేరు సంపాధించుకున్న నరేష్‌కు.. ఇప్పుడు ప్రాణహాని ఉంది. నా ఆత్మరక్షణ కోసం నా గన్ లైసెన్స్ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

ప్రాణహాని ఉంది.. నా గ‌న్ లైసెన్స్ రెన్యువ‌ల్ చేయండి: న‌టుడు న‌రేష్
New Update

Life is in danger Renewing my gun license Actor Naresh

ఎస్పీని ఆశ్ర‌యించిన న‌టుడు న‌రేష్

తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌టుడు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు న‌రేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం అత‌ను క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. అయితే న‌టుడుగా కంటే కూడా ఎక్కువ‌గా అత‌ని పెళ్లిల్ల విష‌యంలోనే అత‌ను కాంట్ర‌వ‌ర్సీ అవుతున్నాడు. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం అంతా వివాదాస్ప‌దంగా ఉంది. న‌టి ప‌విత్ర లోకేష్‌తో న‌రేష్ రిలేష‌న్‌లో ఉన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే...ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో కూడా హ‌ల్ చ‌ల్ న‌డుస్తోంది. న‌రేష్ మూడో భార్య అయిన ర‌మ్య‌ర‌ఘుప‌తిని విడిచిపెట్టి, విడాకులు ఇవ్వ‌కుండా ప‌విత్ర‌తో ఆయ‌న క‌లిసి ఉంటున్నారు.

ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు

నరేష్‌కి మూడో భార్య రమ్య రఘుపతికి మ‌ధ్య విడాకుల విషయంలో చాలా గొడ‌వలు అవుత‌న్నాయి. విడాకులు కావాల‌ని న‌రేష్, వ‌ద్ద‌ని ఆమె కోర్టులో కేసు న‌డుస్తూనే ఉంది. ఈక్ర‌మంలో న‌రేష్ ఉమ‌నైజ‌ర్ అనీ ర‌మ్య అంటే, నా ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోంది అంటూ న‌రేష్ ఇలా ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూనే ఉన్నారు.

ఆత్మ రక్షణ కోసం ఆయుధం కావాలి

ఇదిలా ఉండగా నరేష్ తుపాకీ లైసెన్సు రెన్యువ‌ల్ కోసం పోలీస్ అధికారులని ఆశ్రయించారు. పుట్టపర్తి జిల్లా ఎస్పీ మాధ‌వ‌రెడ్డిని కలిసిన నరేష్ తుపాకీ లైసెన్సు జారీ చేయాలని కోరారు. న‌క్స‌ల్స్ హిట్ లిస్టులో ఉండ‌డంతో 2008లో త‌న‌కు గ‌న్ లైసెన్స్ ఇచ్చార‌నీ, ప్ర‌స్తుతం ప్రాణహాని ఉందని, ఆత్మ రక్షణ కోసం ఆయుధం కావాలని దానిని రెన్యువ‌ల్ చేయాల‌ని నరేష్ కోరినట్లు సమాచారం. అత‌ని ద‌ర‌ఖాస్తు స్వీక‌రించిన ఎస్పీ ఉన్న‌తాధికారుల‌కు పంపుతాన‌ని చెప్పారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe