LIC Jeevan Utsav: LIC అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలు తీసుకువస్తుంటుంది. అలానే ఇటీవల ఒక సరికొత్త పాలసీని పరిచయం చేసింది. ఇందులో ఐదేళ్లు మనం పెట్టుబడితే తరువాత పదేళ్ల నుంచి జీవితాంతం ప్రతి సంవత్సరం పెట్టుబడి పై 10 శాతం ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ పాలసీ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం..
ఈ పాలసీ పేరు LIC జీవన్ ఉత్సవ్(LIC Jeevan Utsav). దీనిని 90 రోజుల వయసు నుంచి 65 ఏళ్ల మధ్య వయసులోని వ్యక్తులు ఎవరైనా తీసుకోవచ్చు. కనీసం పెట్టాల్సిన పెట్టుబడి 5 వేలు.. గరిష్టంగా ఎంతైనా పెట్టవచ్చు. 5 నుంచి 16 ఏళ్ల వరకూ ప్రీమియం కట్టవచ్చు. ఐదేళ్లు ప్రీమియం కట్టిన తరువాత మరో ఐదేళ్లు వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. అంటే పదేళ్ల తరువాత నుంచి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. 6 ఏళ్ళు ప్రీమియం కడితే నాలుగేళ్లు, 7 ఏళ్ళు ప్రీమియం కడితే మూడేళ్లు, 8 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకూ ప్రీమియం కడితే రెండేళ్లు వెయిటింగ్ పిరియడ్ వర్తిస్తుంది. ఈ పాలసీ స్పెషాలిటీ ఏమిటంటే.. ఇన్సూర్ చేసిన వ్యక్తి వెయిటింగ్ పిరియడ్ తరువాత నుంచి జీవితాంతం హామీ మొత్తంలో 10 శాతం ఆదాయం పొందవచ్చు.
Also Read: ఇప్పుడైతే కొనేయవచ్చు.. బంగారం తగ్గుతోంది.. వెండి కూడా అంతే..
పాలసీ గురించిన వివరాలు..
ఈ పాలసీ(LIC Jeevan Utsav) ప్రాథమిక హామీ మొత్తం రూ. 5,00,000. మీరు మీ వీలును బట్టి 5 నుంచి 16 సంవత్సరాల వరకు ప్రీమియం కాలాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని ఎంచుకున్నారని అనుకుందాం. ఆపై ప్రతి సంవత్సరం సుమారు రూ. 1.16 లక్షలు (GSTతో సహా) ప్రీమియంగా చెల్లించాలి. ప్రీమియం టర్మ్ పూర్తయిన తర్వాత, మీరు మరో ఐదేళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. తరువాతి సంవత్సరం నుంచి.. అంటే, పాలసీ తీసుకున్న పదకొండవ సంవత్సరం నుంనుంచి, మీరు ప్రతి సంవత్సరం ఇన్సూర్డ్ మొత్తంలో 10 శాతం పొందుతారు. మీరు రూ. 5 లక్షల పాలసీ(LIC Jeevan Utsav) కాబట్టి అందులో 10 శాతం అంటే, రూ. 50 వేలు మీకు ప్రతి సంవత్సరం వస్తాయి. ఈ మొత్తం జీవితాంతం ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం సంవత్సరం చివరిలో మీరు తీసుకోవచ్చు.
ఇన్సూరెన్స్ పాలసీ(LIC Jeevan Utsav) తీసుకున్న తర్వాత ఒకవేళ అకాల మరణిస్తే రూ. 5 లక్షలు అతని కుటుంబ సభ్యులకు అందిస్తారు. ఇది సహజ మరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీకు ప్రమాద ప్రయోజనం లేదా వైకల్యం ప్రయోజనం కావాలంటే, ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రమాద ప్రయోజనం తీసుకుంటే బీమా మొత్తం రూ. 5 లక్షలు, మరో రూ. 5 లక్షలు మొత్తం రూ. 10 లక్షలు పాలసీదారుని కుటుంబ సభ్యులకు ఇస్తారు.
గమనిక: ఈ ఆర్టికల్ LIC వెబ్సైట్ లో ఇచ్చిన సమాచారం ఆధారంగా పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. ఈ పాలసీ తీసుకోవాలని కానీ.. ఇదే పాలసీ తీసుకొమ్మని కానీ మేం రికమండ్ చేయడం లేదు. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సలహాలు తీసుకోవడం అలానే ఇన్సూరెన్స్ కంపెనీ అధీకృత ఏజెంట్స్ నుంచి పూర్తి వివరాలు తీసుకోవడం మంచిది అని సూచిస్తున్నాం
Watch this interesting Video: