Rocket Attack : రాజకీయ అస్థిరతతో కుదేలవుతున్న లిబియా(Libiya) లో మరో కలకలం రేగింది. దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా(Abdul Hameed Al Dabeja) ఇంటి పై ఆదివారం రాకెట్ గ్రనేడ్(Rocket Attack) దాడి జరిగింది. దీంతో ప్రధాని నివాస భవనం స్వల్పంగా దెబ్బతింది. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం గురించి అక్కడి కేబినెట్ లోని మంత్రి ఒకరు వివరించారు.
పేలుడు సంభవించడంతో ప్రధాని నివాసం వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. 2011 నుంచి కూడా లిబియాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతునే ఉంది. పాలన రెండు వర్గాల్లో చేరింది. 2014లోనే దేశం రెండు ప్రాంతాలు విడిపోయింది. తూర్పు, పశ్చిమలై ఎవరికీ వారే పాలించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సమస్యను చక్కదిద్దేందుకు ఐక్యరాజ్యసమితి 2021 లో రంగంలోకి దిగింది. అబ్దుల్ హమీద్ నేతృత్వంలో నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే దేశంలోని రెండు వర్గాలు కూడా ఆయన ను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించాయి. దీంతో దేశంలో అస్థిరత నెలకొంది.
Also Read : అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా బాలిక మృతి!