డ్రగ్స్ మాఫియాను అరికడతాం.. సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతి

ప్రజలకు రక్షణతో కూడిన సేఫ్టీ పాలనను అందించడమే తమ ముందున్న లక్ష్యమని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. బుధవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్స్ తోపాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.

New Update
డ్రగ్స్ మాఫియాను అరికడతాం.. సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతి

సైబరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన అవినాష్ మహంతి నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేస్తామన్నారు. అలాగే చట్టబద్ధంగానూ నడుచుకుంటూ తమ వద్ద ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని భద్రత,రక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామన్నారు. బుధవారం విలేఖర్లతో సమావేశంలో మాట్లాడిన ఆయన ఇటీవల అతిపెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.

ప్రజలకు రక్షణతో కూడిన సేఫ్టీ పాలనను అందించడమే మా ముందున్న లక్ష్యం. సైబరాబాద్ పరిధిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. సైబర్ నేరాలు ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్నాయి వాటిని కంట్రోల్ చేస్తాం. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాటిపై కూడా దృష్టి పెడతాం. శివారు ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఫోకస్ పెడతాం. మూడు కమిషనరెట్ పరిధిలో అందరితో చర్చించి డ్రగ్స్ మాఫియాను అరికడతాం. అన్ని రకాల కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని వివరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, రెగ్యులర్ క్రైమ్స్ పై దృష్టి సారిస్తామని వెల్లడించారు. డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా డ్రగ్స్ ఎక్కడినుండి వస్తున్నాయి ఆన్న అంశాలపై విచారణ చేస్తామన్నారు అవినాష్ మహంతి. 31 డిసెంబర్ రోజున వేడుకలు పోలీస్ నిబంధనలు అనుగుణంగా జరుపుకోవాలని, పబ్బులు ఫామ్ హౌస్ లపై అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడతామని హెచ్చరించారు.

Also read : CM Revanth Reddy New Team: సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీమ్ లిస్ట్ ఇదే.. ఐటీ హెడ్ ఎవరో తెలుసా?

ఇదిలావుంటే.. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా అవినాష్‌ మహంతి, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా జీ సుధీర్‌బాబులను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీరిద్దరూ విధి నిర్వహణలో సిన్సియర్‌ అధికారులుగా వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ(అడ్మిన్‌)గా పని చేస్తున్న అవినాష్‌ మహంతికి చట్టానికి లోబడి, ముక్కుసూటిగా పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తారన్న పేరున్నది. ప్రభుత్వ భూముల కబ్జాలు, మట్టి కుంభకోణం, చీటింగ్‌, సైబర్‌ కేసులు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ అమాయక ప్రజలను పట్టి పీడించిన కలర్‌ ప్రిడిక్షన్‌, లోన్‌ యాప్‌ వంటి కేసులను ఛేదించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం సైబరాబాద్‌ సీపీగా నియమించింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీగా కొనసాగుతున్న జి.సుధీర్‌బాబుకు హైదరాబాద్‌తో పాటు రాచకొండ కమిషనరేట్‌పై గట్టి పట్టున్నది. మహబూబ్‌నగర్‌ ఎస్పీగా, టాస్క్‌ఫోర్స్‌, అల్వాల్‌, శంషాబాద్‌ డీసీపీగా, వరంగల్‌ సీపీగా పని చేశారు. రాచకొండ జాయింట్‌ సీపీగా పని చేసిన ఆయన ఐజీగా పదోన్నతి పొందిన తరువాత హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటారు. రాచకొండలో జాయింట్‌ సీపీగా పని చేసిన అనుభవం ఉండడంతో ప్రభుత్వం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా నియమించింది.

Advertisment
తాజా కథనాలు