siddipet: దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణ ఎదిగాం: మంత్రి హరీష్‌రావు

సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆల‌యాన్ని మంత్రి హ‌రీశ్‌రావు సంద‌ర్శించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్‌రావు.

New Update
siddipet: దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణ ఎదిగాం: మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. నూతనంగా నిర్మించిన హుస్నాబాద్ డివిజన్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించే ఏసీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్‌రావు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంద‌ని ఆర్థికశాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు హ‌రీశ్‌రావు. స్వామి వారిని దర్శించుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంర‌తం రూ.40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాప‌న చేశారు మంత్రి హరీష్‌రావు

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు కాబ‌ట్టే తెలంగాణ రాష్ట్రంలోని దేవాల‌యాల‌ను అభివృద్ధి చేస్తున్నార‌ని అన్నారు. రూ.1200 కోట్లతో యాదాద్రి ఆయాలన్ని అభివృద్ధి చేశారని అన్నారు. రూ. 600 కోట్లతో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అర్చకులకు జీతాలు, ఆలయాల అభివృద్ధి కొరకు చర్యలు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమే అని హరీష్‌రావు స్పష్టం చేశారు.

10 వేల దేవాలయాల్లో దూపాదీప నైవేద్యం కొరకు రూ.6000 వేలను రూ.10, 000కు పెంచి ఇస్తున్నామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు వెల్లడించారు. పోట్లపల్లిలో 140 దేవాలయాలు ఉన్నాయని, అలాంటి గ్రామంలో రూ.40 లక్షల‌తో రామాలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది అన్నారు. శివాలయ గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తాన‌ని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో గత 9 ఏళ్ల నుంచి పంటలు పండుతున్నాయన్నారు. గతం ప్రభుత్వాలు ఉన్నప్పుడు తిండి గింజలకు ఇబ్బదులు పడిన మనం.. నేడు రాష్ట్రంలో రెండు పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా ఎదిగాం అన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు