ఇంటికి సెలవు..120 రోజులు హార్డ్‌ వర్క్‌: రేవంత్‌రెడ్డి

మనమే అధికారంలోకి రావడం ఖాయం. కానీ మీరంతా మనం అధికారాన్ని సాధించడానికి 120 రోజులు ఇంటికి సెలవు పెట్టండి అంటూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో బూత్‌ వారీగా ఓటర్ల లిస్టును క్షుణ్ణంగా పరిశీలించడానికి మీరంతా కృషి చేయాలి. అందుకోసం ప్రతిపక్షం అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో ముందుకు వెళ్లాలని రేవంత్ పిలుపునిచ్చారు.

New Update
ఇంటికి సెలవు..120 రోజులు హార్డ్‌ వర్క్‌: రేవంత్‌రెడ్డి

Let work hard to bring the Congress party to power

ఎన్నికల్లో చట్టాల మార్పుల కోసం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి టీకాంగ్రెస్ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి. వారు ఈరోజు ఇందిరాభవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని వ్యాఖ్యానించారు. దాన్ని తిప్పికొట్టడానికి ఏమేం కార్యాచరణ చేయాలో నిర్ణయించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.

అధికారం మనదే

అయితే పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వారన్నారు. పాలకపక్షాన్ని, ఇతర పార్టీలను రాబోయే ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కునేందుకు మనం సిద్దం కావాలనీ, అందుకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త 120 రోజులు ఇంటికి సెలువు పెట్టి కష్టపడి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ సూచించారు. రాబోయే ఎన్నికలలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న అంశాలపై మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్‌లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. దీనికి వారంతా తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు

అంతేకాకుండా ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34,654 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని..గతంలో పార్టీ బూత్ ఎన్ రోలర్సే.. బీఎల్ఏలని వివరించారు. అందులో యాక్టివ్‌గా ఉన్న బూత్ ఎన్ రోలర్స్ ను బీఎల్ఏ లుగా నియమించుకోవాలనన్నారు. తెలంగాణలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చే 12వేల ఓట్లను తొలగించారని, ఒక కుటుంబానికి ఐదు ఓట్లు ఉంటే రెండు ఓట్లను డిలీట్ చేశారని వ్యాఖ్యానించారు.

అప్రమత్తంగా ఉంటూ ప్రజ ముందుకు

బూత్‌లను మార్చి ఓటరును గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కోవడంలో బూత్ లెవల్ ఏజెంట్లు సహాయపడాలని.. వారే కీలకమైన వ్యక్తులన్నారు. బూత్ వారీగా ఓటర్ లిస్టును క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొంటూ. ఓటరు జాబితా సరిగా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లే అని చెప్పారు. బీజేపీ-బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని వాటిని వేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. అందుకోసం ప్రతిపక్షం అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో ముందుకు వెళ్లాలని రేవంత్‌రెడ్డి సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు