Rajamahendravaram leopard: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం

AP: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరు దాటాక బయటకు ఒంటరిగా రావద్దని హెచ్చరించారు. చిరుత కనిపిస్తే 1800 4255 909 నెంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

Rajamahendravaram leopard: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం
New Update

Rajamahendravaram leopard: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం స్ధానికంగా భయాందోళన రేకెత్తిస్తోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిన్న కాకినాడ నుంచి రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడవి శిక్షణ కేంద్రానికి రెండు బోనులు చేరుకున్నాయి. రెండు కెమెరాల్లో పులి సంచరిస్తు రికార్డయిన ఫోటోలు రిలీజ్ చేశారు అధికారులు. చిరుత పులి బిహేవర్ ని పట్టి ఎన్ని రోజుల్లో పట్టుకోగలం అనేది ఇప్పట్లో చెప్పలేమని డీఎఫ్‌ఓ తెలిపారు..

జనసంచారం ఉన్న ప్రాంతంలోనే చిరుత 'సంచరిస్తోందని జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని, అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బోనులో బంధిస్తామని ఫారెస్ట్ అధికారులు భరోసా ఇచ్చారు. జాతీయ రహదారి వద్ద దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు గుర్తించారు. నిన్న చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

సాయంత్రం ఆరు దాటాక ఒంటరిగా బయటకు రావద్దని ప్రజలను అధికారులు హెచ్చరించారు. ప్రతి ఒక్కరు టార్చ్ లైట్ తోనే బయటకు రావాలని, ఆరు బయట ప్రదేశాల్లో కూర్చోవద్దని హెచ్చరికలు జారీ చేశారు డీఎఫ్‌ఓ. రాజమహేంద్రవరం శివారు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ, స్వరూప్ నగర్, రూప్ నగర్, పద్మావతి నగర్, ఫాతిమా నగర్, తారకరామ నగర్, దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత పులి సంచార ప్రాంతాల్లో దండోరాలు వేశారు. చిరుత గురించి సమాచారం తెలిస్తే 1800 4255 909 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి తెలపాలని పేర్కొన్నారు.

#leopard
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe