Tirumala chirutha Video : బోనులో చిక్కిన చిరుత.. ఫలించిన అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు! తిరుమల కాలినడక మార్గంలో అర్థరాత్రి ఓ చిరుత బోనులో చిక్కింది. చిన్నారి లక్షితను చంపేసిన చిరుత అదే కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే.. చిన్నారిని చంపేసిన ప్రదేశానికి దగ్గర్లోనే ఈ బోనును ఏర్పాటు చేశారు. అర్థరాత్రి వేళ చిరుత ఆ బోనులోకి వచ్చి చిక్కింది. By Trinath 14 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తిరుమల(tirumala) కొండపై ఏర్పాటు చేసిన బోనుకు చిక్కింది చిరుత. ఎట్టకేలకు అర్థరాత్రి చిరుతను బంధించారు అధికారులు. మూడ్రోజుల క్రితం చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుతను పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. లక్షిత(Lakshitha)పై దాడి చేసిన ప్రాంతంలో ఏర్పాటుచేసిన బోనులో పడింది చిరుత(chirutha). అయితే లక్షితను చంపింది ఈ చిరుతనేనా కాదా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం నాలుగు ప్రాంతాల్లో చిరుతను పట్టుకునేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేయగా. అందులో ఒకదాంట్లో చిరుత చిక్కింది. ఈ చిరుత వయసు 5 సంవత్సరాలు ఉండొచ్చని సమాచారం. అంటే పెద్ద చిరుత అనే అర్థం. కాబట్టి ఇదే లక్షితను చంపేసిందానన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక నెల రోజుల క్రితం బాలుడిపై దాడి చేసిన చిరుత చిన్నదని.. దాని వయసు ఏడాదిన్నర మాత్రమేనని తెలుస్తోంది. అందుకే ఆ బాలుడిని చంపకుండా చిరుత వదిలిపెట్టిందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం బోనులో చిక్కిన చిరుత మాత్రం పెద్దదని.. లక్షితని ఇదే చంపేసి ఉండొచ్చని ప్రజలు అనుకుంటున్నారు. అటు రెండ్రోజుల్లో చిరుత 5 ప్రాంతాల్లో సంచరించినట్టు గుర్తించారు అధికారులు. హై లెవల్ మీటింగ్: మరోవైపు చిరుత దాడులు జరగకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో భక్తుల సంఖ్య తగ్గించటంపై కసరత్తు చేస్తోంది. దర్శన టికెట్ల కోటా పెంపు ద్వారా నడక మార్గంలో రద్దీ తగ్గింపు సాధ్యమేనా అనే అంశంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు భక్తుల రక్షణపై హైలెవల్ మీటింగ్ ఉంటుందని ఈవో తెలిపారు. చిరుతల వల్ల భక్తులకు ఇబ్బంది లేదని భరోసా ఇవ్వాలన్నదే తమ ప్రయత్నమని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అలిపిరిలో మూడు చిరుతలు సంచరిస్తున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. ఇక లక్షితను చంపింది ప్రస్తుతం బోనులో చిక్కుకున్న చిరుతేనని భావిస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అటు జూన్‌లో కూడా ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. అప్పుడు కూడా బోను ఏర్పాటు చేయగా.. చిరుత చిక్కింది. దానిని బంధించి కళ్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. నివేదిక కోరిన చైల్డ్ రైట్స్ కమిషన్: లక్షిత మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని టీటీడీ, అటవీ, పోలీసు, రెవెన్యూ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరింది. ఈ మేరకు చైర్‌పర్సన్ కేసలి అప్పారావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన 6ఏళ్ల బాలిక లక్షిత శుక్రవారం రాత్రి తిరుమల కొండపై నడుచుకుంటూ వెళ్తుండగా చిరుత దాడి చేసి చంపేసింది. గత జూన్ 22న కర్నూలు జిల్లాకు 4 ఏళ్ల కౌశిక్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కౌశిక్ ఘటన జరిగిన తర్వాత టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, వన్యప్రాణులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి, ఘటనపై పూర్తి నివేదికను వారంలోగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు అందించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. #targeted-death-of-baby-in-tirumala #tirumala-chirutha-attack-on-kid #chiruth-attack-in-tirumala #tirumala-child-death మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి