Lemon and Ginger: నిమ్మకాయ, అల్లంతో ఇలా చేస్తే నెల రోజుల్లో 5 కిలోలు తగ్గొచ్చు

నిమ్మ అనేది సిట్రస్ పండ్ల. ఇది బరువు తగ్గించడంతో పాటు కడుపు, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. అల్లం, నిమ్మకాయ బరువు తగ్గడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మం యవ్వనంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Lemon and Ginger: నిమ్మకాయ, అల్లంతో ఇలా చేస్తే నెల రోజుల్లో 5 కిలోలు తగ్గొచ్చు

Lemon and Ginger: బరువు తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సరైన వ్యాయామం, ఆహారంతో పాటు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. అందులో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మ అనేది సిట్రస్ పండ్లకు చెందినది. అన్ని సిట్రస్ పండ్లు బరువు తగ్గడానికి మంచివి. ఇందులో ఉండే విటమిన్ సి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

publive-image

నిమ్మకాయ:

పరిమాణంలో చిన్నగా ఉన్నా ఎన్నో విటమిన్లు ఇందులో ఉన్నాయి. మీడియం సైజు నిమ్మకాయలో 53 గ్రాముల వైరామిన్ సి ఉంటుంది. ఇది బరువు తగ్గించడంతో పాటు కడుపు, చర్మ, జుట్టు సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది.

publive-image

అల్లం:

లీటరు నీటిలో అల్లం ముక్క వేసి మరిగించి ఉదయాన్నే ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు. ఏసీడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగకూడదు. అల్పాహారం చేసిన గంటన్నర తర్వాత తాగవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో షుగర్‌, ఉప్పు మాత్రం కలపవద్దని చెబుతున్నారు.

publive-image

అల్లం వల్ల ఉపయోగాలు:

కడుపులో ఉన్న చెత్తాచెదారం మూత్రం లేదా మలం రూపంలో బయటికి పంపుతుంది. వారానికి ఒకసారి అల్లం నీటిని తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. వెర్టిగో, బీపీ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అల్లం తీసుకోకూడదు. దానితో పాటు వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.

publive-image

నిమ్మకాయ ఉపయోగాలు:

ఏసిడిటీ ఉన్నవారు సగం నిమ్మకాయ తీసుకుంటే మంచిది. ఇది బరువు తగ్గడమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మం యవ్వనంగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు సంరక్షణకు కూడా నిమ్మకాయ బాగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా?..ఈ నూనెలు వాడండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు