Delhi accident: రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌ మేకర్‌ మృతి..ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రజలు!

ప్రజల్లో మచ్చుకైన మానవత్వం కనిపించడం లేదు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఫిల్మ్‌ మేకర్‌ పియూష్‌ ని ఆసుపత్రిలో చేర్పించాల్సింది పోయి వీడియోలు, ఫోటోలు తీస్తూ ఉండిపోయారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటు చేసుకుంది.

Delhi accident: రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌ మేకర్‌ మృతి..ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రజలు!
New Update

దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లో ఘోర రోడ్డు (Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో యువ ఫిల్మ్‌ మేకర్‌ ప్రాణాలు కోల్పోయాడు. పియూష్‌ పాల్‌ ( 30) అనే వ్యక్తి గురుగ్రామ్‌ లో ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌ గా పని చేస్తున్నాడు. సౌత్‌ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

ఈ క్రమంలో అతను రోజూ తన బైక్‌ పై ఉద్యోగానికి వెళ్లి వస్తుంటాడు. అయితే ఎప్పటిలాగానే అక్టోబర్‌ 28న కూడా తన విధులు ముగించుకుని బైక్‌ పై ఇంటికి రాత్రి తిరిగి వస్తుండగా..కొంచెం దూరం వచ్చిన తరువాత పంచ్‌ శీల్‌ ఎన్‌ క్లేవ్‌ దగ్గర్లో పియూష్‌ని మరో ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది.

Also read: చరణ్‌ కు మరో అరుదైన గౌరవం..ఆస్కార్‌ మెంబర్‌ లిస్ట్ లో చెర్రీ పేరు!

దీంతో పియూష్‌ బండి మీద నుంచి కిందపడిపోవడంతో పాటు..బైక్‌ ని ఢీకొట్టిన ద్విచక్రవాహనదారుడు అలాగే కొన్ని మీటర్ల మేర రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లి పోయాడు. కొంత దూరం వెళ్లిన తరువాత పీయూష్‌ బండి నుంచి వేరుపడి రోడ్డు పక్కన పడిపోయాడు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న పియూష్‌ ని చూస్తూ వీడియోలు తీసుకుంటున్నారే తప్ప ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని చావు బతుకుల్లో ఉన్న ఫిల్మ్‌ మేకర్‌ పియూష్‌ ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో పియూష్‌ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న పియూష్‌ స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ మనిషి ప్రాణాలతో పోరాడుతుంటే ఎవరూ సాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం తర్వాత పియూష్‌ ఫోన్‌, కెమెరాను ఎవరో దొంగలించినట్లు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.

#film-maker #delhi #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe