Room fresheners tips: ప్రస్తుతం వివిధ సువాసనలతో కూడిన రూమ్ ఫ్రెషనర్లు మార్కెట్‌లో సులభంగా లభిస్తాయి. కానీ.. ఈ కెమికల్ రూమ్ ఫ్రెషనర్ల వాసన ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అలాంటి రసాయన వాసనలకు దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంట్లో నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేసుకోవాలంటే ఇంట్లో ఉంచిన ఈ వస్తువులతో రూమ్ ఫ్రెషనర్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రూమ్ ఫ్రెషనర్లు కోసం కావాల్సిన పదార్థాలు
1.ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ చేయడానికి మీకు నచ్చిన ఏదైనా సుగంధ నూనె తీసుకోవాలి. అందులో అరకప్పు వెనిగర్, రెండు కప్పుల నీళ్లు కలపాలి. ఇప్పుడు స్ప్రే బాటిల్‌లో వేసి బాగా కలిపి ఇంట్లో స్ప్రే చేస్తే ఇల్లు సువాసనతో వెదజల్లుతుంది.
2. లవంగాలు, దాల్చినచెక్, ఏలకులను మూడు కప్పుల నీటిలో 15-20 నిమిషాలు తక్కువ మంటపై మరిగించాలి. ఇది చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఇది చాలా మంచి, సుగంధ ఎయిర్ ఫ్రెషనర్ లాగా పని చేస్తుంది.
3.వంటగదిలోని డస్ట్‌బిన్ నుంచి వచ్చే దుర్వాసనను వదిలించుకోవడానికి కర్పూరం చాలా ఉపయోగపడుతుంది. పాత పాత్రను వేడి చేసి అందులో కర్పూరం వేయాలి. వంటగదిలో మాత్రమే ఈ పాత్రను వదిలివేయాలి. దీంతో కర్పూరం సువాసన మెల్లగా ఇంటింటా వ్యాపించి.. దుర్వాసన పూర్తిగా పోంతుంది.
4. నిమ్మ, నారింజ, సీజనల్ ఫ్రూట్స్ వంటి సిట్రస్ పండ్ల పీల్స్ కూడా రూమ్ ఫ్రెషనర్‌గా ఉపయోగించవచ్చు. ఈ తొక్కలను నీటిలో పది నిమిషాల పాటు మరిగించాలి. నీటిని ఫిల్టర్ చేసి చల్లబరచండి. స్ప్రే బాటిల్‌లో నింపి స్ప్రే చేయాలి.
5. మంచి సువాసన గల కొన్ని పువ్వుల ఆకులను తీసుకుని నీటిలో వేయండి. తక్కువ మంట మీద కనీసం 30 నిమిషాలు నీటిని మరిగించాలి. ఈ నీరు చల్లబడినప్పుడు తరువాత స్ప్రే బాటిల్‌లో నింప్పుకోవాలి. మీకు ఇంట్లో ఏదైనా వాసన వచ్చినప్పుడు..దానిని స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది.
ఇది కూడా చదవండి: పాలు-కొబ్బరి స్వీట్ కేవలం 4 రూపాయాలే.. నిమిషాల్లో బాక్స్ మొత్తం ఖాళీ!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.