గూగుల్ లే ఆఫ్ లు కొనసాగుతాయ్..స్పందించిన సుందర్‌ పిచాయ్‌..

గూగుల్‌లో లే ఆఫ్‌లు ఈ ఏడాది మొదటి 6 నెలల  కొనసాగుతాయని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తేల్చి చెప్పారు.రెండో భాగంలో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్‌ హ్యాండ్స్‌ సమావేశంలో ఆయన తెలిపారు.

గూగుల్ లే ఆఫ్ లు కొనసాగుతాయ్..స్పందించిన సుందర్‌ పిచాయ్‌..
New Update

గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఆ సంస్థ లే ఆఫ్ లు గురించి స్పందించారు. సుందర్‌ పిచాయ్‌ని ఈ లే ఆఫ్‌లు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయని ప్రశ్నించగా, ఆయన పైవిధంగా స్పందించారు. కొవిడ్‌ తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు.. ఆ తర్వాత కూడా కొనసాగిన విషయం తెలిసిందే. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ టెక్‌ కంపెనీ అయిన గూగుల్‌ కూడా అందుకు మినహాయింపు కాదు.

గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ కంపెనీ.. ఈ ఏడాది వందల సంఖ్యలో వి తొలగింపులు చేపట్టింది. ఈ నేపథ్యంలో లేఆఫ్‌లపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అదే విషయాన్ని వారు నేరుగా ఆయన్నే అడిగారు. తొలగింపులు కొనసాగుతాయని చెప్పిన సుందర్‌ పిచాయ్‌.. మరో విషయం కూడా వెల్లడించారు. అది గూగుల్‌లో ఉద్యోగాలు ఆశించేవారికి నిరాశ కలిగించే విషయమే. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. రానున్న రోజుల్లో కొత్త నియామకాల విషయంలోనూ గూగుల్‌ క్రమశిక్షణతో వ్యవహరించనుందని చెప్పారు.

ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం కంటే ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నట్టు ఆయన ఉద్యోగులకు వివరించారు. దీనిని బట్టి గూగుల్‌లో ప్లేస్‌మెంట్లు ఆశించేవారికి ఇది నిరుత్సాహానికి గురిచేసే విషయంగానే భావించాలి.ఇదే సమావేశంలో సుందర్‌ పిచాయ్‌కి ఉద్యోగుల నుంచి మరికొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. త్రైమాసిక ఆదాయాల్లో ఊహించిన దానికంటే అధికంగానే కంపెనీ వృద్ధి నమోదు చేస్తున్నప్పటికీ.. కంపెనీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందని, వేతనాల పెంపు చేపట్టడం లేదంటూ కొందరు ప్రశ్నించారు.

లేఆఫ్‌ వల్ల ఉద్యోగుల్లో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతోందని, ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య అంతరం పెరుగుతోందని ఓ ఉద్యోగి పిచాయ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పిచాయ్‌ మాట్లాడుతూ.. మెరుగైన ఫలితాలొక్కటే కంపెనీ విజయాన్ని సూచించవని చెప్పారు. గూగుల్‌ అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుందని, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

#google-ceo-sundar-pichai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి