Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' ఓటీటీలోకి వచ్చేది ఆరోజేనా?

'కల్కి' ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ‍్లిక్స్ రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఇందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి 'కల్కి' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. లాంగ్ వీకెండ్ కాబట్టి ఓటీటీ సంస్థలు ఈ తేదీకే మొగ్గు చూపే అవకాశముందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.

Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' ఓటీటీలోకి వచ్చేది ఆరోజేనా?
New Update

Latest Update On Kalki 2898AD OTT Release : పాన్ ఇండియా హీరో (PAN INDIA HERO) ప్రభాస్ (Prabhas) నటించిన 'కల్కి 2898AD' మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 27 న రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల మార్క్ కు చేరువలో ఉంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.

కల్కి ని థియేటర్స్ లో ఎలా అయితే లాంగ్ వీకెండ్ చూసి రిలీజ్ చేసారో.. ఓటీటీ రిలీజ్ విషయంలోనూ మేకర్స్ అదే ఫార్ములా అప్లై చేస్తున్నారట. ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని రెండు సంస్థ దక్కించుకున్నాయి. దక్షిణాది భాషలకు సంబంధించిన హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) దక్కించుకోగా, హిందీ రైట్స్ మాత్రం నెట్‌ఫ‍్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది.రిలీజ్‌కి ముందే 7-8 వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకొచ్చేలా కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని టాక్ వినిపిస్తుంది.

Also Read : పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ.. స్వయంగా బయటపెట్టిన ‘జబర్దస్త్ బ్యూటీ’..!

ఇందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి 'కల్కి' (Kalki 2898AD) ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. చాలావరకు ఇది నిజమయ్యే ఛాన్సులే ఉన్నాయి. ఎందుకంటే అది లాంగ్ వీకెండ్ కాబట్టి అప్పుడు రిలీజైతే ఎక్కువమంది చూడటానికి అవకాశముంటుంది. కాబట్టి ఓటీటీ సంస్థలు ఈ తేదీకే మొగ్గు చూపే అవకాశముందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.

#prabhas #kalki-2998-ad-movie #kalki-ott-release
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe