Srilanka: శ్రీలంక ప్రెసిడెంట్ రేసులో దూసుకుపోతున్న దిసానాయకే..

ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయడంతో.. దేశంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జేవీపీ పార్టీకి చెందిన అనుర కుమార దిసానాయకే ప్రెసిడెంట్ రేసులో 53 శాతం ఓట్లతో ముందున్నారు.

Anura Kumara Dissanayake
New Update

శ్రీలంకలో 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేశారు. దీంతో ఇటీవల శ్రీలంక అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. శ్రీలంక మార్క్సిస్ట్ నాయకుడు అయిన అనుర కుమార దిసానాయకే ప్రెసిడెంట్ రేసులో దుసుకుపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల పోలింగ్‌లో దిసానాయకే 53 శాతం ముందున్నారు. 

45 రోజుల్లోగా పార్లమెంట్ రద్దు చేస్తాం

ప్రతిపక్ష నేత అయిన సాజిత్ ప్రేమదాస్ 22 శాతం ఓట్లుతో రెండో స్థానంలో ఉండగా.. రణిల్ విక్రమసింఘే మూడో స్థానంలో ఉన్నారు. జనతా విముక్తి పెరెమునా పార్టీ అధినేత అయిన దిసానాయకే.. నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. జనతా విముక్తి పెరెమునా పార్టీకి పార్లమెంట్‌లో మూడు స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం పొందితే 45 రోజుల్లోగా పార్లమెంట్ రద్దు చేస్తామనే హామీలిచ్చారు. పేదలకు కొత్త విధానాలు తీసుకురావడం, అవినీతికి వ్యతిరేక చర్యలు తీసుకుంటామని దిసానాయకే ప్రజలకు హామీ ఇచ్చారు.

#elections #srilanka #votes-counting
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe