🔴 LIVE BREAKINGS: వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Jan 17, 2025 13:28 IST

    వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

    విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. మూడో రోజు రూ.106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్లు మేకర్స్ తెలిపారు.

    sankranthiki vasthunnam collections



  • Jan 17, 2025 13:20 IST

    పూణే హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన వాహనం! 9 మంది స్పాట్ డెడ్

    మహారాష్ట్రలోని నాసిక్- పూణే హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఐచర్ వాహనం ప్రయాణికులతో వెళ్తున్న మాక్సిమో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు.

      nasik pune high way Accident
    nasik pune high way Accident

     



  • Jan 17, 2025 11:23 IST

    సైఫ్ కేసులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    సైఫ్ మీద అటాక్ చేసినట్టుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నామని ముంబై పోలీసులు తెలిపారు. సీసీ టీవీ కెమెరాలు...సైఫ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం అరెస్ట్ చేశామని తెలిపారు.

    saif  ali khan attack
    saif ali khan attack

     



  • Jan 17, 2025 10:13 IST

    సైఫ్‌ను పొడిచి కోటి డిమాండ్..సీన్ టూ సీన్ వివరించిన నానీ

    నటుడు సైఫ్ అలీఖాన్‌కు ప్రాణాపాయం లేదని...గాయాల నుంచి కోలుకుంటున్నారని చెప్పారు ముంబైలోని లీలావతి ఆసుత్రి వైద్యులు . దాదాపు 30 ని. సైఫ్‌పై దుండగుడు దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అతను కోటి రూపాయలు డిమాండ్ చేశాడని...ఇవ్వకపోవడంతో అటాక్ చేశాడని చెప్పారు. 

    actor
    Saif Ali Khan

     



  • Jan 17, 2025 10:12 IST

    హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!

    హైదరాబాద్ షేక్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జుహి ఫెర్టిలిటీ సెంటర్‌లో చెలరేగిన మంటలు చుట్టుపక్కల అంతా వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న డీమార్ట్, ట్రెండ్స్ రిలయన్స్‌కు స్టోర్లకు కూడా మంటలు అంటుకున్నాయి.

    Fire Accident
    Fire Accident

     



  • Jan 17, 2025 08:10 IST

    8th Pay: కేంద్ర ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు

    కేంద్ర ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు ఓకే చెప్పింది. దీంతో కోటి పదిహేను లక్షల మంది ఉద్యోగుల, పింఛనదారుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి. 

    central
    8th pay commission

     



  • Jan 17, 2025 08:09 IST

    తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు!

    తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి నిర్ణయించనుంది.

    liquor



  • Jan 17, 2025 08:08 IST

    చిత్తూరులో ఘోర ప్రమాదం..నలుగురు మృతి!

    చిత్తూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.గంగాసాగరం వద్ద ఆగిఉన్న టిప్పర్‌ ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

     Accident
    Accident Photograph: ( Accident)

     



  • Jan 17, 2025 08:07 IST

    Open AI: నా కొడుకుని ఓపెన్ ఏఐ నే చంపేసింది!

    చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ విజిల్‌ బ్లోయర్, భారత సంతతి వ్యక్తి సుచిర్‌ బాలాజీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పై బాలాజీ అమ్మ పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు.ఓపెన్‌ ఏఐ సంస్థ తన కొడుకుని హత్య చేసిందన్నారు.

    open ai
    open ai

     



  • Jan 17, 2025 08:06 IST

    హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

    తెలంగాణలో చలి కాస్త తగ్గుముఖం పట్టింది.హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రానున్న మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

    delhi fog
    delhi fog

     



  • Jan 17, 2025 08:05 IST

    APSRTCకి భారీ లాభాలు.. సంక్రాంతికి కాసుల పంట

    ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను నడిపింది.దీంతో ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది.

    APSRTC: కార్తీక మాసం సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ!



Advertisment
తాజా కథనాలు