🔴Janasena Formation Day Live Updates: జనసేన 12వ ఆవిర్భావ సభ..

పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు. ఈ బహిరంగసభ వేదికగా పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు.

author-image
By Lok Prakash
New Update
Janasena Formation Day

Janasena Formation Day

🔴Janasena Formation Day Live Updates: 

పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు. ఈ బహిరంగసభ వేదికగా పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. కూటమి ప్రభుత్వంతో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం ఇదే కావడం విశేషం. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్. 

  • Mar 14, 2025 22:02 IST

    ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్‌, సాయిధరమ్ తేజ్ అభిమానులకు నా ప్రత్యేక నమస్కారాలు...



  • Mar 14, 2025 22:01 IST

    హెలికాఫ్టర్ లో వస్తుంటే టాలీవుడ్ హీరోల పోస్టర్లు కనిపించాయి: పవన్ కల్యాణ్‌



  • Mar 14, 2025 22:01 IST

    టాలీవుడ్ హీరోల అభిమానులకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్‌



  • Mar 14, 2025 22:00 IST

    సమాజంలో మార్పు కోసం వచ్చా.. ఓట్ల కోసం కాదు: పవన్‌



  • Mar 14, 2025 21:12 IST

    జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ సంచలనం

    • ఒక్కడిగా మొదలుపెట్టా.. ఈ స్థాయికి వచ్చాం..
    • నన్ను తిట్టని తిట్టు లేదు.. అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వచ్చా..
    • నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ..
    • గద్దర్ నన్ను ఏరా తమ్ముడూ అని పిలిచేవాడు..



  • Mar 14, 2025 20:52 IST

    పవన్ కల్యాణ్‌ జాతీయ నేతగా ఎదగాలి- మంత్రి నాదెండ్ల

    • ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయికి మనం ఎదిగాం: మనోహర్‌
    • మన అడుగులు ఎప్పుడూ సామాన్యుడివైపే నడుస్తాయి: మనోహర్‌
    • మన పోరాటంలో 463 మంది జనసైనికులు ప్రాణాలు కోల్పోయారు: మనోహర్‌
    • మరణించిన జనసైనికులకు పవన్‌ అండగా ఉన్నారు: మనోహర్‌
    • ప్రజలకు మేలు చేసేందుకు జనసేన కట్టుబడి ఉంది: మనోహర్‌



  • Mar 14, 2025 20:20 IST

    పవన్‌ అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా నెరవేరుస్తాం: పంచకర్ల

    • ఈ 9 నెలల్లో అనేక సమస్యలపై పవన్ స్పందించారు: పంచకర్ల
    • ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని పవన్ చెప్పారు: పంచకర్ల
    • పవన్‌ కల్యాణ్‌ వల్లే పోటీచేసిన వారంతా గెలిచాం: పంచకర్ల



  • Mar 14, 2025 20:18 IST

    దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా మనం ఉండాలనేది పవన్ ఆలోచన: కొణతాల

    • తనవెంట పవన్ ఉన్నారని మోదీ ఇటీవల అన్నారు: కొణతాల
    • రాష్ట్రం, ఇక్కడి ప్రజలు బాగుండాలని పవన్‌ భావించారు: కొణతాల
    • ఏ సమస్య చెప్పినా తానున్నానని ధైర్యం చెప్పేవారు పవన్: కొణతాల
    • విశాఖ స్టీల్‌ప్లాంట్ సమస్యను 8 నెలల్లోనే పరిష్కరించేలా చేశారు: కొణతాల



  • Mar 14, 2025 20:17 IST

    ఎన్నికల సమయంలో మాకు పవన్ అండగా నిలిచారు: లోకం మాధవి

    • మన కర్తవ్యం, బాధ్యత మరింత పెరిగాయి: లోకం మాధవి
    • ఎన్నో అవమానాలు భరించాం.. అవహేళనలు ఎదుర్కొన్నాం..: లోకం మాధవి
    • రైతులకు, కార్మికులకు అండగా నిలబడ్డాం: లోకం మాధవి
    • అందరం కలిసి స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేయాలి: లోకం మాధవి



  • Mar 14, 2025 20:15 IST

    మన్యం వీరుడు.. ఆనాడు అల్లూరి.. నేడు పవన్ కల్యాణ్‌.. : నిమ్మక జయకృష్ణ



  • Mar 14, 2025 20:13 IST

    పవన్‌ సౌత్ ఇండియా మోదీ: పంతం నానాజీ

    • మోదీ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నాయకుడు పవన్‌ : పంతం నానాజీ
    • ఎన్నికల తర్వాత కూడా పవన్ క్రేజ్‌ వందరెట్లు పెరిగింది: పంతం నానాజీ
    • జనసేన పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలి: పంతం నానాజీ
    • నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన పవన్‌కు ధన్యవాదాలు: పంతం నానాజీ
    • ఈ సభ మన పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది: పంతం నానాజీ



  • Mar 14, 2025 20:05 IST

    నుదిటన తిలకంతో ఆవిర్భావ సభకు పవన్‌ ఎంట్రీ..



  • Mar 14, 2025 20:04 IST

    Nagababu: పిఠాపురంలో పవన్‌ విజయంపై.. వర్మకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు!

    జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. ‘పవన్ విజయానికి 2 కారణాలు ఉన్నాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్‌‌ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని తెలిపారు.

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో భారీగా ‘జయకేతనం’ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, జనసైనులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్లు చేశారు. 

    ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మకు కౌంటర్ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అని అన్నారు. పిఠాపురంలో పవన్‌ గెలవడానికి రెండు ప్రధాన కారణాలు -ఉన్నాయని అన్నారు. అందులో మొదటి కారణం పవన్‌ కల్యాణ్ అని అన్నారు. ఆ తర్వాత రెండో కారణం  జనసైనికులు, కార్యకర్తలు అంటూ నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఈ రెండు కారణాల వల్లే పవన్ విజయం సాధించారు అని తెలిపారు. దీంతో పవన్‌ గెలుపులో వర్మ పాత్ర లేదని నాగబాబు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 



  • Mar 14, 2025 19:54 IST

    ఆవిర్భావ సభకు చేరుకున్న పవన్ కల్యాణ్‌..



  • Mar 14, 2025 19:54 IST

    నా ఆస్తులు జగన్ కాజేశాడు- బాలినేని శ్రీనివాస్ రెడ్డి

    • నాతో సినిమా తీస్తానని పవన్ కల్యాణ్‌ మాట ఇచ్చారు: బాలినేని
    • ప్రాణం ఉన్నంత వరకు పవన్‌ కల్యాణ్‌తోనే ఉంటా: బాలినేని
    • జగన్‌ చేసిన అన్యాయం చెప్పాలంటే ఇప్పుడు సమయం చాలదు: బాలినేని
    • జగన్‌ నాకు చేసిన అన్యాయాన్ని మరోసారి చెబుతా: బాలినేని
    • నా ఆస్తులు జగన్‌ కాజేశారు: బాలినేని
    • జగన్ వల్ల నేను, నా కుటుంబసభ్యులు ఎంతో బాధపడ్డాం: బాలినేని



  • Mar 14, 2025 19:14 IST

    పవన్ అంత ఎత్తుకు ఎదగలేను- నాగబాబు

    • పవన్ కల్యాణ్‌ చాలా గొప్ప వ్యక్తి..
    • అతను చాలా ఎత్తుకు ఎదిగాడు..
    • వీలైతే ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నించాలి..
    • లేదంటే అంత గొప్ప వ్యక్తికి సేవకుడిగా ఉండాలి..
    • నేను పవన్ అంత ఎత్తుకు ఎదగలేను..
    • అందుకే సేవకుడిగా ఉండిపోయాను..



  • Mar 14, 2025 19:11 IST

    పవన్ కల్యాణ్ గెలుపుపై నాగబాబు కీలక వ్యాఖ్యలు..

    పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు జనసేన కార్యకర్తలు, ప్రజలు కీలకంగా పనిచేశారన్నారు. ఎవరో ఒక వ్యక్తి వల్ల పవన్ కల్యాణ్ గెలుపు వచ్చింది కాదన్నారు. తమ వల్లే పవన్ గెలిచాడు అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు.



  • Mar 14, 2025 19:10 IST

    జగన్ ఇంకో 20ఏళ్లు పడుకో... జగన్ పై నాగబాబు సెటైర్ల వర్షం

    జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ.. జగన్ నిద్రలోకి వెళ్లిపోయారని.. ఆ నిద్ర నుంచి ఇంకా బయటకు రాలేదని, జగన్ మాటలు చూస్తే నిద్రలో కలవరిస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జగన్ ఇంకో 20 ఏళ్లు నువ్వు పడుకో.. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అంటూ సెటైర్లు వేశారు.



  • Mar 14, 2025 19:06 IST

    12వ ఆవిర్భావ దినోత్సవం జనసేనకు పుష్కరాల లాంటిది- నాగబాబు

    12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయని.. ఈ జనసేన 12వ ఆవిర్భావ సభ కూడా పుష్కరాల్లాంటిదేనన్నారు నాగబాబు.



  • Mar 14, 2025 18:32 IST

    పవన్ కు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు- పురంధేశ్వరి



  • Mar 14, 2025 17:56 IST

    కాసేపట్లో సభావేదిక వద్దకు జనసేనాని..



  • Mar 14, 2025 17:55 IST

    హెలికాప్టర్‌లో పిఠాపురంకు పవన్‌ కల్యాణ్‌



  • Mar 14, 2025 17:55 IST

    సభా ప్రాంగణంలో 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘా..



  • Mar 14, 2025 17:54 IST

    రాత్రి 10 గంటల వరకు సభ సాగే అవకాశం..



  • Mar 14, 2025 17:53 IST

    Janasena Formation Day 2025: జనసేన సభలో తొక్కిసలాట.. పోలీసుల లాఠీ ఛార్జ్- ఒక మహిళ స్పాట్‌లోనే!

    పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సభాప్రాంగణం లోపలికి జనసైనికులు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరగగా.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ సృహతప్పి పడిపోయింది. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

    High Tension In Janasena Foundation Day Celebration in Pithapuram
    High Tension In Janasena Foundation Day Celebration in Pithapuram Photograph: (High Tension In Janasena Foundation Day Celebration in Pithapuram)

     



  • Mar 14, 2025 17:50 IST

    Janasena Formation Day LIVE: జనసేన ఆవిర్భావ సభలో ఉద్రిక్తత.. గోడలు దూకి రచ్చ రచ్చ!

    పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా సభాప్రాంగణం లోపలికి జనసైనికులు దూసుకొచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ గోడలు దూకి, స్టేజీ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

    High Tension In Janasena Foundation Day Celebration in Pithapuram
    High Tension In Janasena Foundation Day Celebration in Pithapuram Photograph: (High Tension In Janasena Foundation Day Celebration in Pithapuram)

     



  • Mar 14, 2025 17:49 IST

    బారికేడ్లను తోసుకుంటూ, గోడలు దూకి, స్టేజీ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం..



  • Mar 14, 2025 17:48 IST

    సభాప్రాంగణం లోపలికి దూసుకొచ్చిన జనసైనికులు..



  • Mar 14, 2025 17:48 IST

    పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ దగ్గర ఉద్రిక్తత వాతావరణం



  • Mar 14, 2025 17:47 IST

    జ్యోతి ప్రజ్వలన చేసిన వీరమహిళలు..



  • Mar 14, 2025 17:40 IST

    జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు



  • Mar 14, 2025 17:40 IST

    ఎమ్మెల్యేల కు సెక్యూరిటీ సిబ్బందికు మధ్య వాగ్వాదం..



  • Mar 14, 2025 17:38 IST

    పిఠాపురం జనసేన సభ వద్ద ఉద్రిక్తత



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు