పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు

పండుగ వేళ సామాన్యులకు షాక్ తగిలింది. వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల రోజుల్లోనే పాయాయిల్ ధరలు 37 శాతం పెరిగాయి. ఆవ నూనె ధరలు 29 శాతం పెరగ్గా, సోయాబీన్ 23 శాతం, సన్‌ఫ్లవర్ 23 శాతం, వేరుశెనగ నూనె 4 శాతం పెరిగాయి. 

Health Tips: ఆహారంలో రిఫైన్డ్‌ ఆయిల్‌ వాడుతున్నారా..? అయితే మీరు విషాన్ని తింటున్నట్లే!
New Update

దీపావళి పండుగ వేళ సామాన్యలపై మరో భారం పడింది. వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల రోజుల్లోనే పాయాయిల్ ధరలు 37 శాతం పెరిగాయి. ఆవ నూనె ధరలు 29 శాతం పెరగ్గా, సోయాబీన్ 23 శాతం, సన్‌ఫ్లవర్ 23 శాతం, వేరుశెనగ నూనె 4 శాతం పెరిగాయి.  వంట నూనెల దిగుమతి సుంకాన్ని గత నెలలో ప్రభుత్వం పెంచడంతో ఈ ధరలు మరింత పెరిగాయి.

ఇది కూడా చూడండి: ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని..

రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడంతో..

పామాయిల్ ధరలు 37 శాతం పెరగడంతో చిప్స్, స్నాక్స్ తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాప్‌ల్లో ధరలు కూడా పెరిగాయి. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ట స్థాయి 5.5 శాతానికి చేరింది. దీంతో చమురు ధరలు కూడా పెరిగాయి. 

ఇది కూడా చూడండి: డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ

ముడి ఆయిల్స్ పెరుగుదల సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అమల్లోకి రావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ముడి పామ్ ఆయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం 27.5 శాతానికి పెంచింది. అయితే శుద్ధి చేసిన ఆహార నూనెపై 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచారు. 

ఇది కూడా చూడండి: BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 7ఏళ్ల జైలు శిక్ష!

గత నెలలో ముడి పామ్‌ఆయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ ప్రపంచ వ్యాప్తంగా వరుసగా దాదాపు 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం పెరిగాయి. మన దేశానికి కావాల్సిన వంటనూనెలు 58శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. అయితే నూనె గింజల పంటల రైతులకు మంచి ధర లభించేలా చూడాలని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రధాన ఆయిల్స్ ధరలు పెరగడంతో దేశీయంగా కూడా నూనె ధరలు అన్ని పెరిగినట్లు తెలుస్తోంది.  

ఇది కూడా చూడండి: తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్‌ పర్యటనలు

#cooking-oil
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe