New Update
AP DSC Application Dead Line: ఏపీలో డీఎస్సీ నోటిపికేషన్(DSC Notification)ను గతంలో(ఫిబ్రవరి 7) విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 6,100 పోస్టులకు ప్రభుత్వం నోటిపికేషన్‌ను విడుదల చేయగా.. ఈ ఎగ్జామ్‌కు అప్లై చేసుకోవడానికి ఇవాళే(ఫిబ్రవరి 25) లాస్ట్ డేట్. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు) నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ఫలితాలను ప్రకటించనున్నారు. 2018 ప్రకారమే పరీక్షల సిలబస్ ఉంటుందని మంత్రి బొత్స ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 44 ఏళ్ళు… ఎస్సీ, ఎస్టీ, బీసీ(SC, ST, BC) లకు అదనంగా మరో ఐదేళ్ళ సడలింపు ఉంటుంది. దీంతో పాటు 1,264 టీజీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులకు కూడా నోటిపికేషన్ విడుదల చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోపే అన్ని నియామకాలను పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
వెబ్‌సైట్‌లోకి వెళ్లడానికి కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఖాళీల వివరాలు:
--> ఎస్టీజీ: 2280 పోస్టులు
--> స్కూల్ అసిస్టెంట్: 2,299 పోస్టులు
--> టీజీటీ: 1,264 పోస్టులు
--> పీజీటీ: 215 పోస్టులు
--> ప్రిన్సిపల్: 42 పోస్టులు
--> ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 12/02/2024.
--> ఫీజుచెల్లింపు చివరితేది: 21/02/2024. (25/02/2024 వరకు పొడిగించారు)
--> ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22/02/2024. (25/02/2024 వరకు పొడిగించారు)
--> ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో: 24/02/2024.
--> పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 05.03.2024 నుంచి.
--> ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు: 15/03/2024 నుంచి 30/03/2024 వరకు.
WATCH THIS TRENDING VIDEO ON YOUTUBE: గాడ్జిల్లా అండ్ కాంగ్ (Trailer)
Advertisment