Bathukamma 2023 Songs: దుమ్ములేపుతున్న బతుకమ్మ పాటలు..! మొదలైన బతుకమ్మ సంబరాలు..

ప్రస్తుతం బతుకమ్మ పండగ సందర్బంగా బతుకమ్మ పాటల సందడి మొదలైంది. ఇక ఈ సంవత్సరం బతుకమ్మ పై పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక బతుకమ్మ పండుగకు దుమ్మురేపుతున్న బతుకమ్మ పాటలు ఇవే..

New Update
Bathukamma 2023 Songs: దుమ్ములేపుతున్న బతుకమ్మ పాటలు..! మొదలైన బతుకమ్మ సంబరాలు..

Bathukamma: తెలంగాణా (Telangana)లో ప్రత్యేకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. ఈ పండగ తెలంగాణ ఆడ బిడ్డలకు ఎంతో ప్రత్యేకమైన పండగ. బతుకమ్మ అంటేనే పువ్వుల పండగ తెలంగాణ ప్రజలు బతుకమ్మను పువ్వులతో అలంకరించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గునుగు, తంగేడు, అడవి చేమంతి, కట్లపూలు, గడ్డి పూలు ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పూజిస్తారు   9 రోజుల పాటు జరుపుకునే ఈ పండగకు రోజు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ , రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిది వెన్నె ముద్దల, తొమ్మిది సద్దల బతుకమ్మ.

తెలంగాణ అస్థిత్వాన్ని తెలిపే గొప్ప పండగే బతుకమ్మ. ముఖ్యంగా ఆడ బిడ్డలు అందగా ముస్తాబయ్యి ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ. వరుస వరుసలుగా పువ్వులను పేర్చి వాటి పై గౌరమ్మను పెట్టి పూజిస్తారు. అందగా తయారు చేసిన బతుకమ్మలను మధ్యలో పెట్టి బొడ్డెమ్మను వేస్తూ ఆనందంతో చిందులేస్తారు.

బతుకమ్మ పండగ వచ్చిందంటే.. ఇక బతుకమ్మ ప్రత్యేకతను తమ పాటల రూపంలో తెలియజేస్తూ సింగర్స్ దుమ్ములేపుతారు. బతుకమ్మ పై వచ్చే ఈ పాటలు పల్లె ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.  ఎక్కడ చూసిన బతుకమ్మ పాటలే వినిపిస్తాయి. ప్రస్తుతం బతుకమ్మ పండగ సందర్బంగా బతుకమ్మ పాటల సందడి మొదలైంది. ఇక ఈ సంవత్సరం బతుకమ్మ పై పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక బతుకమ్మ పండుగకు దుమ్మురేపుతున్న బతుకమ్మ పాటలు ఇవే..

Also Read: Abhishek Agarwal: ‘టైగర్ నాగేశ్వర్ రావు’ నిర్మాతకు షాక్..! టెన్షన్ లో రవితేజ..!

Advertisment
తాజా కథనాలు