వైఎస్సార్ చివరి కోరిక..రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి: భట్టి విక్రమార్క పంజాగుట్ట సర్కిల్‌లో డాక్టర్ వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లతుడూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్న వైఎస్సార్ చివరి కోరికను నెరవేర్చడమే మనం వైఎస్సార్‌కు అర్పించే నిజమైన నివాళి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చూపించిన మార్గంలో.. ఆయన వేసిన బాటలో కాంగ్రెస్ నాయకులు పనిచేయాలన్నారు. By Vijaya Nimma 08 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ప్రజల మహానీయుడు ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలంగాణ భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగరానికి మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి ఘనమైన ప్రాజెక్టులు సాధించిన ఘనత ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని మాజీ మంత్రి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు దానం నాగేందర్ తెలిపారు. ఘనంగా నివాళులు మహానేత వైఎస్ఆర్ 74వ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ జయంతి కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు పలువురు నాయకులు, ప్రజలు,కాంగ్రెస్ నేతలు, భారీ సంఖ్యలో ఆయన అభిమానులు హాజరయ్యారు. ముందు చూపుతోనే అభివృద్ధి ఈనాటి సమాజానికి కావలసిన అవసరాలను ఆనాడే డాక్టర్ వైఎస్సార్ గుర్తించారని ఆయన అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు, మెరుగైన వైద్యం కల్పించడానికి ఆరోగ్యశ్రీ, ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజ్ రియంబర్స్‌మెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి నదీ జలాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన జిల్లా యజ్ఞం, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా అనేక కార్యక్రమాలు ముందు చూపుతో చేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్సార్ అని గుర్తు చేశారు. చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావాలని హైదరాబాద్‌ను ఉపాధి మార్గంగా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు. ఉపాధి అవకాశాలకు పునాదులు హైటెక్ సిటీని మరింత అభివృద్ధి చేసి సాఫ్ట్‌వేర్ రంగాన్ని తీసుకొచ్చారు.. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేయడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు పరిశ్రమలు రావడానికి పునాదులు వేసిన దార్శనికుడు డాక్టర్ వైఎస్సార్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని త్రిబుల్ ఐటీని తీసుకువచ్చారు.వైఎస్సార్ ఆలోచనపరంగా కలుద్దాం.. నడుద్దాం... కలిసి ప్రయాణం చేద్దాం. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న వైఎస్సార్ చివరి కోరికను నెరవేర్చడానికి మనందరం కష్టపడుదాం విక్రమార్క అన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి