2000 Notes: రూ.2 వేల నోటు మార్చుకోవడానికి నేడే లాస్ట్ ఛాన్స్.. వెంటనే మార్చుకోండిలా!

2000 Notes: రూ.2 వేల నోటు మార్చుకోవడానికి నేడే లాస్ట్ ఛాన్స్.. వెంటనే మార్చుకోండిలా!
New Update

ఈ రోజే సెప్టెంబర్ 30(September 30)..రూ.2000 నోట్ల (2000 notes) ను మార్చుకోవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈరోజు కానీ ఆ నోట్లను మార్చుకోకపోతే తెల్లారి నుంచి అంటే ఆదివారం నుంచి ఆ నోట్లు చిత్తు కాగితాలతో సమానమని ఆర్బీఐ (RBI)తెలిపింది. ఇప్పటికే 94 శాతం నోట్లు బ్యాంకు (Bank) ఖాతాల్లోకి చేరాయని అధికార లెక్కలు చెబుతున్నాయి.

మిగిలిన 6 శాతం నోట్లు కూడా మార్చుకోవడానికి ఈరోజే చివరి రోజని బ్యాంకు అధికారులు, కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ఎప్పుడో ప్రకటించింది. అప్పటి నుంచి కూడా ఆ నోట్లను వివిధ పద్దతుల్లో మార్చుకోవాలని బ్యాంకులకు జమ చేయాలని అధికారులు చెబుతున్నారు.

ఈరోజు తరువాత రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పొడిగించే ప్రసక్తే లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నాటికి ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం..ఆగస్టు 31 వరకు రూ.2000 నోట్లలో 93 శాతం నోట్లు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. ఆ సమయంలో సుమారు 24 వేల కోట్లు మార్కెట్‌ లో ఉన్నాయి.

మే 19 2023 న రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అతి పెద్ద కరెన్సీ నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎవరి వద్దనైనా నోట్లు ఉన్నట్లయితే కనుక ఆ నోట్లను సెప్టెంబర్ 30 వ తేదీలోపు మార్చుకోవాలని తెలిపింది. ఎప్పుడైతే 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిందో..ఆ సమయం వరకు కూడా మార్కెట్లో సుమారు రూ. 3.62 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి.

రూ.20 వేల విలువ ఉన్న నోట్లను ఏ బ్యాంకులో నైనా మార్పిడి చేసుకోవచ్చు.రూ. 50 వేలు రూపాయలు ఆ పైబడి నోట్లు మార్చుకోవాలంటే మాత్రం కచ్చితంగా పాన్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న రూ. 2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయి.

నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన 20 రోజుల్లోనే సుమారు 50 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.మార్కెట్లో ఉన్న ఇంకా 7 శాతం నోట్లు బ్యాంకులకు చేరాల్సి ఉందని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికైనా వారంతా కూడా దగ్గర్లో ఉన్న బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోమని పేర్కొంది.

#rbi #last-day #2000-notes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe