Mizoram: 39మంది భార్యలు, 94మంది పిల్లలు.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీ మన భారతీయుడిదే!

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం మన భారతీయుడిదే. మిజోరంకు చెందిన జియోనా చానా అనే వ్యక్తి 39 మంది మహిళలను వివాహం చేసుకోగా 94 మంది పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం 181 మందితో బక్తవాంగ్ గ్రామంలో ఈ ఫ్యామిలీ ఉమ్మడిగానే నివసిస్తుంది.

New Update
Mizoram: 39మంది భార్యలు, 94మంది పిల్లలు.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీ మన భారతీయుడిదే!

Biggest family: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీ కలిగివున్న వ్యక్తిగా భారతీయుడు రికార్డు సృష్టించాడు. మిజోరం (Mizoram) లోని బక్తవాంగ్ గ్రామానికి చెందిన జియోనా చానా (Jeona Chana) అనే వ్యక్తి ముప్పైకి పైగా మహిళలను పెళ్లి చేసుకుని ఔరా అనిపించాడు. అంతేకాదు వారితో దాదాపు వంద మంది పిల్లలకు జన్మనిచ్చి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన కుటుంబం ఉమ్మడిగానే నివసిస్తుండటం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన ఆసక్తికర స్టోరీ గురించి మనం తెలుసుకుందాం.

39 మంది భార్యలు, 94 మంది పిల్లలు..
ఈ మేరకు మిజోరంకు చెందిన జియోనా చానా అనే వ్యక్తి.. దశలవారిగా 39 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారందరితో 76 ఏళ్ల వరకూ పిల్లలను కంటూనే ఉన్న చానా.. మొత్తం 94 మందికి జన్మనిచ్చారు. చానా కుటుంబంలో అతని పిల్లలతోపాటు 36 మంది మనమళ్లు, మనవరాల్లు ఒకే వయసుకు చెందినవాళ్లు కావడం విశేషం. కాగా జియోనా చానా 2011లో 76 ఏళ్ల వయసులో అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో కన్నుమూశాడు. ఇంకా అతని భార్యలు చాలామంది బతికే ఉన్నారు.

ఒకే ఏడాదిలో 10 మందితో వివాహం..
ఇక జియోనా చానాకు తన మొదటి పెళ్లిలలో 17 ఏళ్లు మాత్రమే. చానా ఒక్కసారి ఒకే ఏడాదిలో 10 మంది మహిళలను పెళ్లి చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అతని భార్యలు పడకగదికి సమీపంలో ఉండే ఒక డార్మిటరీని కలిసి పంచుకునేవారు. అందరూ ఒకేసారి భోజనం చేయడానికి చాలా పెద్ద డైనింగ్ హాల్‌ నిర్మించారు.

ఇది కూడా చదవండి : Britain: లవర్ లేదు, భార్య లేదు.. అయినా 180 మంది పిల్లలకు తండ్రి! ఎలాగంటే?

181 మందితో ఉమ్మడిగా నివాసం..
అయితే ప్రస్తుతం అతని కుటుంబంలో 181 మంది సభ్యులుండగా వీరంతా భారతదేశం మీజోరంలోని బక్తవాంగ్ గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. దాదాపు 100 గదులున్న నాలుగు అంతస్తుల ఇంట్లో ఈ కుటుంబం నివసిస్తోంది. కాలక్రమేణా చానా ఇల్లు ప్రధాన పర్యాటక ప్రాంతంగానూ జనాలను ఆకర్షించింది. 1942లో జియోనా చానా తండ్రి జియోనా నిర్మించిన ఆ ఇంటికి 'చానా' అనే నామకరణం చేశారు. చానా కుటుంబం 2011లో వరల్డ్ రికార్డ్ అకాడెమీ, 2011లో ది వాల్ స్ట్రీట్ జర్నల్, ఆపై 2019లో లండన్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే 'అతిపెద్ద కుటుంబం'గా నమోదు చేయబడింది.

Advertisment
తాజా కథనాలు