బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన లంబాడీ సంఘాలు

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన కామెంట్స్‌ పై లంబాడాలు భగ్గుమంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఈ పరిణామాలను గమనించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ ఎంపీ బాపురావు చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని అన్నారు. పార్టీకి సంబంధం లేదని చెప్పారు.

New Update
బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన లంబాడీ సంఘాలు

రిజర్వేషన్లు అవసరం లేదన్న ఎంపీ

హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లంబాడీలకు రిజర్వేషన్లు అవసరం లేదన్న ఎంపీ సోయం బాపురే వ్యాఖ్యలపై బీజేపీ కార్యాలయం ముట్టడికి లంబాడీ సంఘాలు ప్రయత్నించాయి. సోయం వైఖరిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు నిరసనకారులు. ఈ క్రమంలో లంబాడీ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు పలువురిని పీఎస్‌కు తరలించారు.

రిజర్వేషన్లను పెంచుతామన్న కిషన్‌రెడ్డి

ఈ సందర్శంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు చేయాలని రాజ్యాంగంలో ఉంది. ఎస్టీలకు రిజర్వేషన్లు రాకుండా 9 ఏళ్లుగా వారికి అన్యాయం చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానిదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతామని వీలైతే ఎన్నికల ముందే పెంచడానికి ప్రయత్నం చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీ కార్యాలయం ముట్టడికి లంబాడీ సంఘాలు పిలుపు

అయితే.. నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం లంబాడీలకు మాత్రమే పోడు భూములకు పట్టాలిచ్చిందని, తాము కూడా ఎన్నో సంవత్సరాలుగా పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నామని ఈ భూములకు కూడా పోడుపట్టాలి ఇవ్వాలని కాయితి లంబాడీలు డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి బీసీల నుంచి తమను ఎస్టీలోకి కలపాలని నినాదాలు చేస్తూ సుమారు అరగంటకు పైగా లంబాడీలు హైవేను దిగ్బంధించారు. విషయం తెలుసుకున్న పెద్ద కొడప్ గల్ ఎస్సై కోనరెడ్డి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. కాసేపు రహదారిపై లేవమంటూ గిరిజనులు మొరాయించారు. దీంతో మరొసారి పోలీసులు ఆందోళనకారులను నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. అయితే ఇవాళ మరోసారి ధర్నాకు దిగారు. లంబాడీలకు రిజర్వేషన్లు అవసరం లేదన్న ఎంపి సోయం బాపురే మాటలతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ... బీజేపీ కార్యాలయం ముట్టడికి లంబాడీ సంఘాలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నగరంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు