ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ .. ఒక్క టికెట్ 16 లక్షలా? ICC పై లలిత్ మోదీ ఫైర్!

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 9 న ఇండియా తమ చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్ తో తలపడబోతుంది. ఈ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ లలిత్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ .. ఒక్క టికెట్ 16 లక్షలా? ICC పై లలిత్ మోదీ ఫైర్!
New Update

IND Vs PAK : టీ 20 వరల్డ్ కప్ త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి అమెరికా మొదటిసారి ఆతిథ్యం ఇస్తోంది. వరల్డ్ కప్ నిర్వాహణ హక్కులు సొంతం చేసుకున్న USA.. మ్యాచ్ లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయింది. అయితే ఈ టోర్నీలో టీమిండియా తమ లీగ్ మ్యాచ్ లనే USA లోనే ఆడనుంది.

ఈ క్రమంలోనే జూన్ 9 న ఇండియా తమ చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్ తో తలపడబోతుంది. IND Vs PAK మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ లో ఉండే క్రేజే వేరు. ఇప్పుడు ఇదే క్రేజ్ ను ICC క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. అయితే ఇదే విషయంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సృష్టికర్త, మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ ICC యాజమాన్యం పై మండిపడ్డాడు.

Also Read : 2024 ఐపీఎల్ కప్ గెలవబోతున్న జట్టు అదే..!

ఒక్క టికెట్ 16 లక్షలా?

ఇండియా- పాక్‌ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ లలిత్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా. " వరల్డ్‌కప్‌లో ఇండియా- పాక్‌ మ్యాచ్‌ నేపథ్యంలో డైమండ్‌ క్లబ్‌ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.

అమెరికాలో వరల్డ్‌కప్‌ నిర్వహిస్తోంది క్రికెట్‌కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్‌ ఎంగేజ్‌మెంట్‌ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు" అంటూ పేర్కొన్నారు. 20 వేల అమెరికన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే.. కాగా లలిత్ మోది ట్వీట్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ రేట్ తెలిసి షాక్ అవుతున్నారు.

#t20-world-cup-2024 #ind-vs-pak
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe