Lakshmi parvathi: 'చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జంతువులు.. వాళ్ల మధ్య సింహం జగన్'

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అడవిలో జంతువులని వాళ్ల మధ్య సింహం జగన్ అని కామెంట్స్ చేశారు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ లక్ష్మిపార్వతి. ఎంతమంది కలిసి వచ్చిన సింహాం లాంటి జగన్ ను ఏం చేయలేరని ధీమ వ్యక్తం చేశారు.

Lakshmi parvathi: 'చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జంతువులు.. వాళ్ల మధ్య సింహం జగన్'
New Update

Lakshmi Parvathi Comments: టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ లక్ష్మిపార్వతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒక దోపిడి దారుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దోపిడి దారుల ట్రాప్ లో పడినందుకు బాధగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబుకి ప్రజలు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెబుతారని కామెంట్స్ చేశారు.

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అడవిలో జంతువులని వాళ్ల మధ్య సింహం జగన్ అని లక్ష్మిపార్వతి వ్యాఖ్యనించారు. ఎంతమంది కలిసి వచ్చిన సింహాం లాంటి జగన్ ను ఏం చేయలేరని ధీమ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ నుండి లాకున్న పార్టీతో చంద్రబాబు చేసేది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎంగా జగన్ మరోసారి ప్రమాణాస్వీకారం చేస్తారని.. టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రతిపక్షంలోనే కూర్చోబెడతారని అన్నారు.

Also Read: పైల్స్ సమస్యతో బాధపడేవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి!

చంద్రబాబు లాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ పవన్  తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నాడని అన్నారు. మంచివాడిగా ఉన్న పవన్ చంద్రబాబు తో కలిసి తప్పు చేశాడని వ్యాఖ్యనించారు. జగన్ పై పవన్ కు వ్యక్తిగత ద్వేషం ఎందుకో తెలియడం లేదని.. కేవలం జగన్ పై ఉన్న ద్వేషంతోనే పవన్ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. రాజకీయంగా జనసేన అధినేత పవన్ కు భవిష్యత్తే లేదని జోస్యం చెప్పారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను కాదు మార్చాల్సింది సీఎంగా జగన్ ను మార్చాలని చేసిన కామెంట్స్ పై స్పందించారు. చంద్రబాబు పరిపాలన నచ్చకే సీఎంగా ఉన్న చంద్రబాబును మార్చారని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఎలక్షన్స్ వరకు ఇలా ఎదో ప్రగల్భాలు మాట్లాడుతారని ఎద్దెవ చేశారు. ఈ సందర్భంగానే లోకేష్ ఒక నాయకుడా? అని ప్రశ్నించారు. లోకేష్ ను నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి సభ పెట్టి హంగామా చేశారని కౌంటర్ వేశారు.

#andhra-pradesh #lokesh #ap-ex-cm-chandrababu #jana-sena-chief-pawan-kalyan #lakshmi-parvathy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe