TGSRTC : ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన కండక్టర్ TG: ఆర్టీసీ బస్సులో గర్భిణికి ఓ లేడీ కండక్టర్ డెలివరీ చేసింది. గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో తన సోదరులకు రాఖి కట్టేందుకు వెళ్తున్న సంధ్య అనే మహిళలకు పురుటి నొప్పులు రాగా, కండక్టర్ వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. By V.J Reddy 19 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Lady Conductor Delivered The Pregnant Woman : రాఖీ పండుగ (Rakhi Festival) నాడు ఆర్టీసీ బస్సు (TGSRTC BUS) లో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. Also Read : ఎల్లుండి భారత్ బంద్‌కు పిలుపు! #tgsrtc #rakhi-festival మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి