Ayodhya Ram Mandir Maha Prasad : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ వీవీఐపీలకు ఇచ్చే '' మహా ప్రసాద్‌ '' కిట్లలో ఏమేం ఉన్నాయో తెలుసా!

అయోధ్య రామమందిరం వీఐపీలకు ఇవ్వడానికి ఆలయ ట్రస్ట్‌ మహ ప్రసాద్‌ కిట్లను తయారు చేసింది. ఈ కిట్ లో స్వచ్ఛమైన నెయ్యి, పంచదార, శెనగపిండి, ఐదు రకాల డ్రై ప్రూట్స్‌, పవిత్ర సరయూ నదీ జలంతో చిన్న బాటిల్‌ తదితర వస్తువులు ఉన్నాయి.

Ayodhya Ram Mandir Maha Prasad : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ వీవీఐపీలకు ఇచ్చే '' మహా ప్రసాద్‌ '' కిట్లలో ఏమేం ఉన్నాయో తెలుసా!
New Update

Ayodhya Ram Mandir : ఎన్నో దశాబ్దాల కల.. ఎందరో మహానీయుల పోరాటం..మరి కొద్ది గంటల్లో తీరబోతుంది. అయోధ్య(Ayodhya) రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంకా ఎంతో సమయం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా రామ మందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటికే అమెరికా వంటి అగ్ర రాజ్యంలో ఉన్న రామ భక్తులు తమ రామ భక్తిని చాటుకున్నారు.

రామ్‌ లల్లా(Ram Lalla) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేరుగా వీక్షించడం కోసం ఇప్పటికే చాలా మంది వీఐపీలు(VIP) అయోధ్య నగరానికి చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయా నాయకులు, తెలుగు హీరోలతో పాటు బాలీవుడ్‌ నటులు, అలాగే క్రీడా రంగం నుంచి క్రికెటర్లు కూడా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ జన్మభూమికి తరలి వెళ్లారు.

సుమారు 7 వేల మంది వీవీఐపీలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రానున్నట్లు అధికారులు తెలిపారు. లక్షలాది మంది భక్తులు స్వామి వారి కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్నారు. ఈ క్రమంలోనే స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేయుచ్చున్న వీవీఐపీలకు అయోధ్య రామ మందిర ఆలయ ట్రస్ట్‌ ప్రత్యేక మహా ప్రసాద్‌(Maha Prasad) ప్యాకెట్లను తయారు చేసింది.

ఇందుకోసం ఆలయ ట్రస్టుకు ఇప్పటికే 20 వేలకు పైగా మహా ప్రసాద్‌ కిట్లు అందాయి. ఈ మహా ప్రసాదం కిట్ లో ఏమోన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ మహా ప్రసాద్‌ కిట్ లో స్వచ్ఛమైన నెయ్యి, పంచదార, శెనగపిండి, ఐదు రకాల డ్రై ప్రూట్స్‌, పవిత్ర సరయూ నదీ జలంతో చిన్న బాటిల్‌, ఎరుపు దారం, తమలపాకులు, రామ కందమూలం, కుంకుమ, అక్షింతలు, రుద్రాక్ష ఉన్నాయి.

అయోధ్య టెంపుల్‌ ట్రస్ట్‌ మార్గదర్శకత్వంలో గుజరాత్‌(Gujarat) లోని భత్వా సేన భారతి గర్విసంత్‌ సేవా సంస్థాన్‌ వారు కిట్లను అందించింది. ఈ ప్రసాదాలను తయారుచేయడానికి సుమారు 200 మంది శ్రమించినట్లు తెలుస్తుంది. సుమారు 5 వేల కిలోల పదార్థాలతో మహా ప్రసాదం కిట్లను తయారు చేశారు.

అంతేకాకుండా సోమవారం నాడు ముఖ్య అతిథులకు అందించే వంటకాల్లో బాదం బర్ఫీ, కచోరీ, పూరీ , బఠానీ-క్యారెట్‌- బీన్స్‌ కూర, పచ్చిమిర్చి, మామిడికాయ పచ్చడి వంటి వాటిని అందిస్తున్నారు. అంతేకాకుండా అయోధ్య నగరంలో సాధువుల బస, భోజన ఏర్పాట్ల పనులను తాము తీసుకున్నట్లు భగ్వా సేన జాతీయ అధ్యక్షుడు కమల్‌ భాయ్‌ రావల్‌ తెలిపారు. ఈ వంటకాలన్నిటిని కూడా వారణాసి, ఢిల్లీలకు చెందిన పెద్ద పెద్ద చెఫ్‌ లు వండుతున్నట్లు సమాచారం.

Also read: అంగన్వాడీ దీక్షా శిబిరం పై విరుచుకుపడ్డ పోలీసులు…దొరికిన వారిని దొరికినట్లు లాగిపడేశారు!

#ayodhya #ram-mandir #sarayu-river #vip #maha-prasad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe